Purandeshwari: ప‌వ‌న్ ఒప్పిస్తాను అన‌లేదు.. వివ‌రిస్తాను అన్నారు

TDP, జ‌న‌సేన (janasena) పొత్తును పవ‌న్ క‌ళ్యాణ్ ప్రక‌టించిన నేపథ్యంలో BJP నేత పురంధేశ్వ‌రి (purandeshwari) స్పందించారు. ప‌వ‌న్ ఢిల్లీకి వెళ్లి BJP హైక‌మాండ్‌తో ప‌రిస్థితిని వివ‌రిస్తాను అని చెప్పారే త‌ప్ప‌.. ఎక్క‌డా కూడా TDP, జ‌న‌సేన‌తో (janasena) పొత్తు పెట్టుకోవాల‌ని BJPని ఒప్పిస్తాన‌ని అన‌లేద‌ని స్పష్టం చేసారు. చంద్ర‌బాబు నాయుడు అక్ర‌మ అరెస్ట్‌పై ముందు స్పందించింది BJPనేన‌ని.. తెలుగు రాష్ట్రాల్లోని BJP నేత‌లే కాకుండా పొరుగు రాష్ట్రాల‌కు చెందివారు కూడా చంద్ర‌బాబుకే స‌పోర్ట్ చేస్తున్నార‌ని తెలిపారు. అలాంట‌ప్పుడు BJP ఎందుకు స్పందించ‌డంలేదని కొంద‌రు ఎలా ఆరోప‌ణ‌లు చేస్తార‌ని మండిప‌డ్డారు పురంధేశ్వ‌రి. (purandeshwari)