Jagan: ప్ర‌శ్నిస్తా అన్న‌వాడు పొత్తు పెట్టుకున్నాడు

త‌ప్పు చేస్తే ఎవ‌రినైనా ప్ర‌శ్నిస్తా అని ప‌వ‌న్ క‌ళ్యాణ్ (pawan kalyan) అంటుంటాడ‌ని.. మ‌రి ఇప్పుడు సాక్షాలు, ఆధారాల‌తో ప‌ట్టుబ‌డిన చంద్ర‌బాబు నాయుడుని (chandrababu naidu) ఎందుకు ప్ర‌శ్నించ‌కుండా ఏకంగా ఆయ‌న‌తో పొత్తు పెట్టుకున్నాడ‌ని అన్నారు ఏపీ సీఎం జ‌గ‌న్ (jagan). చంద్ర‌బాబు దొంగ‌గా దొరికినా కూడా ఆయ‌న‌కే స‌పోర్ట్ చేస్తున్నారంటూ ఎవ‌రు మోస‌గాళ్లో ఏపీ ప్ర‌జ‌ల‌కు అర్థ‌మైపోయింద‌ని అన్నారు. ఇటీవ‌ల రాజ‌మండ్రి జైల్లో జ్యుడిషియ‌ల్ క‌స్టడీలో ఉన్న చంద్ర‌బాబును ప‌వ‌న్ క‌ళ్యాణ్ పరామ‌ర్శించిన సంగ‌తి తెలిసిందే. ఆయ‌న్ను ప‌రామ‌ర్శించిన త‌ర్వాత ప‌వ‌న్ మీడియా ముందుకు వ‌చ్చి రానున్న ఏపీ ఎన్నిక‌ల్లో TDP, జ‌న‌సేన (janasena) క‌లిసే బ‌రిలోకి దిగుతాయ‌ని ప్ర‌క‌టించారు.