Nara Lokesh: లోకేష్‌ని కలిసిన రఘురామ కృష్ణంరాజు
అసమ్మతి నేత రఘురామ కృష్ణంరాజు.. (raghu rama krishna raju) నారా లోకేష్‌ని (nara lokesh) కలిసారు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన నేపథ్యంలో రఘురామ కృష్ణంరాజు రోజూ ఈ కేసుకు సంబంధించి లాజిక్స్, నిజానిజాలు ఇవి అంటూ ప్రెస్మీట్లు పెట్టి ప్రజలకు తెలియజేస్తున్నారు. ఒకప్పుడు ఏపీ సీఎం జగన్ (ap cm jagan) తనను జైల్లో పెట్టినప్పుడు చంద్రబాబు మద్దతుగా నిలిచారని ఇప్పుడు ఆయన్ను బయటికి తీసుకురావడానికి తన వంతు సాయం చేస్తానని అన్నారు.