Actor: ఆడ బొమ్మలతో టెంప్ట్ చేయొద్దు.. నటుడి కామెంట్స్
ప్రముఖ మలయాళ నటుడు (actor) ఆలెన్షియర్ (alencier) చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. నిన్న కేరళలో అవార్డుల కార్యక్రమంలో ఆయన నటించిన అప్పన్ (appan) సినిమాకు గానూ స్పెషల్ జ్యూరీ అవార్డ్ అందుకున్న అలెన్షియర్.. అవార్డుని అందరికీ చూపిస్తూ స్పీచ్ ఇచ్చారు. “” ఇలాంటి ఆడ బొమ్మలను అవార్డులుగా ఇచ్చి మమ్మల్ని టెంప్ట్ చేయకండి. మన ముఖ్యమంత్రి ఆజానుబాహుడు. కాబట్టి మగవాడి బొమ్మను అవార్డుగా ఇవ్వండి “” అన్నారు. దాంతో ఆయన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. అంతేకాదు.. ఒక మగాడి బొమ్మతో తయారుచేసిన అవార్డు ఇచ్చిన రోజు తాను యాక్టింగ్ మానేస్తానని కూడా ప్రకటించడం వైరల్‌గా మారింది. అసలు ఆయన ఆడవాళ్ల గురించి అలా టెంప్టింగ్ అంటూ ఎలా కామెంట్స్ చేస్తారంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సారీ చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు. (actor)