N Sanjay: 13 చోట్ల చంద్రబాబు సంతకాలు ఉన్నాయ్
TDP అధినేత చంద్రబాబు నాయుడు (chandrababu naidu) స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో చాలా మంది ఆధారాలు లేకుండా అరెస్ట్ చేసారు అని ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో AP CID ADG ఎన్ సంజయ్ (n sanjay) ప్రెస్ మీట్ నిర్వహించారు. అసలు ఎందుకు అరెస్ట్ చేసారో వివరిస్తూ మరోసారి స్కాంకు సంబంధించిన వివరాలు తెలియజేసారు.
కార్పొరేషన్‌ని ఏర్పాటుచేయడానికి క్యాబినెట్ అనుమతి తీసుకోవాలి. ఆ అనుమతి లేకుండా కార్పొరేషన్ ఏర్పాటుచేసి హవాలా రూట్‌లోకి వెళ్లడం ఈ కేసులో జరిగింది. విచారణలో అప్పటి ప్రభుత్వ పెద్ద అయిన చంద్రబాబు చెప్పడం వల్లే ఈ ఆర్థిక నేరం జరిగిందని తేలింది. కార్పొరేషన్ రూల్ ప్రకారం ఏర్పాటుచేయలేదు. అందులో ఒకే వ్యక్తికి మూడు బాధ్యతలు ఇచ్చారు. ఈ గంటా సుబ్బారావు అనేవారు ప్రైవేట్ వ్యక్తి. TDPకి చార్టెడ్ అకౌంటెంట్‌గా పనిచేసిన వెంకటేశ్వరులు అనే వ్యక్తినే ఈ కార్పొరేషన్‌కు కూడా అకౌంటెంట్‌గా పెట్టారు.
చంద్రబాబు అనుమతితో 13 సంతకాలు జరిగాయి. GOలో 10 శాతం ఇచ్చిన వాటానే ఉంది కానీ సీమెన్స్ కంపెనీ (siemens company) ఇచ్చిన ఫండింగ్ గురించి లేదు. రూ.58 కోట్లతో సాఫ్ట్‌వేర్ కొన్నారని అన్నారు. కానీ రికార్డుల్లో మాత్రం రూ.2000 కోట్లతో సాఫ్ట్‌వేర్ కొన్నట్లు ఉంది. అదేంటి అని అడిగితే.. ఆ రూ.2000 కోట్లతోనే సాఫ్ట్‌వేర్ కొన్నామని చెప్తున్నారు. ఏపీలో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లు ఆరు చోట్ల పెట్టాలనుకున్నారు. కానీ ఎక్కడ పెట్టాలనుకుంటున్నారో డిసైడ్ అవ్వకముందే డబ్బు చేతులు మారిపోయింది. ఇక్కడే మోసం కనపడుతోంది. సుమన్ బోస్ షెల్ కంపెనీలతో చేతులు కలిపినట్లు సీమెన్స్ కూడా అంటోంది. అచ్చెన్నాయుడు సంతకాలు కూడా ఐదు చోట్ల ఉన్నాయని సంజయ్ తెలిపారు. ఈ కేసులో అనుమానితులు విదేశాల్లో దాక్కున్నారు కాబట్టి వారిని కూడా విచారించడానికి సమయం పడుతుందని తెలిపారు. (n sanjay)