Payyavula Keshav: సీమెన్స్ త‌ప్పు లేద‌ని మీకెలా తెలుసు?

స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ స్కాంలో (skill development scam) సీమెన్స్ సంస్థ (siemens) తప్పే లేద‌ని అధికార ప్ర‌భుత్వం ఎలా చెప్తుంది అని ప్ర‌శ్నించారు TDP సీనియ‌ర్ నేత ప‌య్యావుల కేశ‌వ్ (payyavula keshav). చంద్ర‌బాబు నాయుడు ప్రారంభించిన ఈ స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ ప్రోగ్రామ్ ద్వారా కొన్ని ల‌క్ష‌ల మంది విద్యార్థులు లాభ‌ప‌డ్డారని ఈరోజు వారు పెద్ద సంస్థ‌ల్లో సంవ్స‌తారికి రూ.10 నుంచి రూ.20 ల‌క్ష‌ల వ‌ర‌కు జీతాలు అందుకుంటున్నార‌ని తెలిపారు. దీని గురించి YSRCPకి చెప్పినా కూడా అర్థంకాద‌ని.. వారికి కావాల్సింది వాలంటీర్లను త‌యారుచేసి వారికి రూ.5000 ఇస్తూ బానిస‌లుగా మార్చ‌డ‌మేన‌ని ఆరోపించారు. ఈరోజుకీ స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ జ‌రుగుతూనే ఉంద‌ని.. ఎవ్వ‌రూ ఆప‌లేక‌పోయార‌ని అన్నారు. అస‌లు స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్‌లో ఎలాంటి త‌ప్పు జ‌ర‌గలేద‌ని తేల్చి చెప్పారు. కోర్టును కూడా త‌ప్పుదోవ ప‌ట్టిస్తూ వ‌చ్చార‌ని, రానున్న ఎన్నిక‌ల్లో ఎక్క‌డ ఓడిపోతామో అన్న భ‌యంతోనే త‌ప్పుడు కేసులు పెట్టి చంద్ర‌బాబును ఇరికించార‌ని అన్నారు. (payyavula keshav)