Bharat: భార‌త్ డార్ట్ అని మార్చిన ప్ర‌ముఖ‌ డెలివ‌రీ సంస్థ‌

మార్పు మొద‌లైపోయింది. ఇండియాను (india) భార‌త్‌గా (bharat) మార్చాల‌ని కేంద్రం నిర్ణ‌యించిన‌ప్ప‌టి నుంచి మ‌ద్ద‌తులు ఎక్కువ‌య్యాయి. వ్య‌తిరేక‌త కూడా బాగానే వ‌చ్చింది. అయితే ఈ నిర్ణ‌యాన్ని అమ‌లు చేసిన మొద‌టి సంస్థ బ్లూ డార్ట్ (blue dart). ప్ర‌ముఖ ఎక్స్‌ప్రెస్ డెలివరీ సంస్థ అయిన బ్లూ డార్ట్ త‌మ పేరును భార‌త్ డార్ట్ (bharat dart) అని మారుస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. భార‌త్‌ని ప్ర‌పంచానికి.. ప్రపంచాన్ని భార‌త్‌కు క‌నెక్ట్ చేయాల‌ని బ్లూ డార్ట్ సంస్థ తీసుకున్న నిర్ణ‌యానికి సంస్థ స్టేక్ హోల్డ‌ర్లు కూడా స‌పోర్ట్ చేయాల‌ని సంస్థ తెలిపింది.