Nadendla Manohar: గుంటూరు మేయ‌ర్‌పై కేసు వేయ‌క‌పోతే జరిగేది ఇదే

గుంటూరు మేయ‌ర్ త‌మ నాయ‌కుల‌పై చేసిన ద్వేషపూరిత వ్యాఖ్య‌ల‌పై వెంట‌నే కేసు నమోదు చేయకపోతే సుప్రీం కోర్టు ఆదేశాల ఉల్లంఘనేన‌ని.. సుప్రీంకోర్టులోనే తేల్చుకుంటామ‌ని జ‌న‌సేన పార్టీ పీఏసీ ఛైర్మ‌న్ నాదండ్ల మ‌నోహ‌ర్ (nadendla manohar) వార్నింగ్ ఇచ్చారు. జ‌న‌సేన నేత‌లు, కార్య‌క‌ర్త‌లు ఎవ్వ‌రినీ ఏమీ అన‌కుండా ప్రశాంతంగా ధర్నాలు, నిర‌స‌న‌లు చేసుకుంటూ ఉంటే గుంటూరు మేయర్ వారిపై నోటికొచ్చిన‌ట్లు మాట్లాడార‌ని.. ఇది ఎంత వ‌ర‌కు క‌రెక్ట్ అని ప్ర‌శ్నించారు. ఆయ‌న‌పై చ‌ర్య‌లు తీసుకోమంటే పోలీసు అధికారులు కూడా వారికే స‌పోర్ట్ చేసార‌ని మండిపడ్డారు. వెంటనే ఆయ‌నపై కేసు న‌మోదు చేయ‌క‌పోతే సుప్రీంకోర్టులో పిటిష‌న్ వేస్తామ‌ని అన్నారు. ద్వేషపూరిత వ్యాఖ్యలపై సుమోటోగా కేసు నమోదు చేయడం పోలీసు ఉన్నతాధికారుల బాధ్యత అని 28-04-2023న గౌరవ జస్టిస్ జోసెఫ్, గౌరవ జస్టిస్ నాగరత్న ఇచ్చిన ఆదేశాల మేరకు సుమోటోగా కేసు పెట్టాలని డిమాండ్ చేసారు. (nadendla manohar)