Balakrishna: మొరిగే కుక్క‌ల్ని పట్టించుకుంటామా?

ఆధారాలు లేకుండా కేవ‌లం రాజకీయ క‌క్ష‌తోనే TDP అధినేత చంద్ర‌బాబు నాయుడుని (chandrababu naidu) అరెస్ట్ చేయించార‌ని అన్నారు బాల‌కృష్ణ‌ (balakrishna). ఎక్క‌డైనా ముఖ్య‌మంత్రి పాల‌సీ మేక‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తారు కానీ.. మ‌ధ్య‌లో ప్రాసెస్ అంతా చూసేది అధికారులేన‌ని తెలిపారు. ఈరోజు చంద్ర‌బాబు అరెస్ట్ అయితే ఎన్నో కుక్క‌లు ప్రెస్ మీట్లు పెట్టి మొరుగుతున్నాయ‌ని వారిని ప‌ట్టించుకుంటే ముందుకు వెళ్ల‌లేమ‌ని అన్నారు. 30 కేసులు పెట్టుకుని హాయిగా బెయిల్‌పై తిరుగుతున్న సీఎం జ‌గ‌న్‌కి బుద్ధిచెప్పే రోజులు ద‌గ్గ‌ర‌ప‌డ్డాయ‌ని అన్నారు. తెలుగు దేశం పార్టీ అంటే మాటిస్తే అది నిల‌బెట్టుకునే పార్టీ అని.. జ‌గన్ మాత్రం ల‌క్ష‌ల కోట్ల అప్పు త‌ప్ప రాష్ట్రానికి మిగిల్చింది ఏమీ లేద‌ని అన్నారు. ఆ అప్పు తీర్చేందుకు భార‌మంతా ప్ర‌జ‌ల‌పై ప‌డ‌బోతోంద‌ని.. ఈసారి ఒక్క ఛాన్స్ అంటున్న జ‌గ‌న్‌కు మ‌ళ్లీ అధికారం క‌ట్ట‌బెడితే అన్నీ ప్ర‌జ‌ల‌కు మిగిలేది ఏమీ ఉంద‌ని హెచ్చ‌రించారు. (balakrishna)