Jawan: న‌య‌న్.. నిన్ను వ‌దులుకోం

జ‌వాన్ (jawan) సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది లేడీ సూప‌ర్‌స్టార్ న‌య‌న‌తార‌ (nayanthara). అట్లీ డైరెక్ష‌న్‌లో వ‌చ్చిన జ‌వాన్ సినిమాలో షారుక్ ఖాన్ భార్య‌గా, ట‌ఫ్ కాప్‌గా అద‌ర‌గొట్టింది. న‌య‌న్ న‌ట‌న‌కు బాలీవుడ్ కూడా ఫిదా అయిపోయింది. ఈ నేప‌థ్యంలో బాలీవుడ్ న‌టుడు అర్జున్ క‌పూర్ (arjun kapoor) న‌య‌న్‌ను మెచ్చుకోకుండా ఉండ‌లేక‌పోయారు. న‌య‌న్.. మా బాలీవుడ్ వైపు వ‌చ్చినందుకు ధ‌న్య‌వాదాలు. ఇక మిమ్మ‌ల్ని అస్స‌లు వ‌దులుకోం అని ట్వీట్ చేయ‌డం వైర‌ల్‌గా మారింది. ఇక జ‌వాన్ రిలీజ్ కాక‌ముందు నుంచే రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తోంది. రిలీజ్ రోజునే రూ.120 కోట్ల వ‌ర‌కు వ‌సూలు చేసిన ఏకైక బాలీవుడ్ సినిమాగా నిలిచింది. ఇప్పుడు రూ.500 కోట్ల వైపు దూసుకెళ్తోంది.