Congress: పిలవగానే వెళ్లారు.. అంత తొందరెందుకు దీదీ?
శని, ఆదివారాల్లో ఢిల్లీలో జీ20 సమ్మిట్ (g20 summit) అట్టహాసంగా జరిగిన సంగతి తెలిసిందే. అయితే.. శనివారం నాడు రాష్ట్రపతి భవన్లో డిన్నర్ ఏర్పాటుచేసారు. ఈ విందుకు ప్రతిపక్ష పార్టీల లీడర్లను పిలిచారు. వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి (mamata banerjee) కూడా ఆహ్వానం అందింది. అయితే.. ఆమె ఆహ్వానం అందింది కదా అని పిలవగానే వెళ్లిపోవడం కాంగ్రెస్ (congress) సీనియర్ లీడర్ అధిర్ రంజన్ చౌదరికి (adhir ranjan choudhary) నచ్చలేదు.
రానున్న లోక్ సభ ఎన్నికల్లో (lok sabha elections) BJPని తరిమికొట్టడానికి కాంగ్రెస్ మరో 27 పార్టీలతో కలిసి ఇండియా (india) అనే కూటమిని ఏర్పాటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ కూటమిలో TMC కూడా ఒక భాగమే. అలాంటిది BJP నుంచి ఆహ్వానం రాగానే తోక ఊపుకుంటూ వెళ్లిపోతే వారికి మాటకు మనం కట్టుబడి ఉన్నామన్న అభిప్రాయం కలుగుతుంది పిలవగానే దీదీ వెళ్లకుండా ఉండాల్సింది అని అధిర్ అన్నారు. (congress)
“” ఎందరో BJPకి చెందిన ముఖ్య నేతలకు ఆహ్వానం అందినప్పటికీ వారు వెళ్లలేదు. కానీ దీదీ మాత్రం పిలవగానే వెళ్లిపోయారు. పైగా కేంద్రమంత్రి అమిత్ షా, ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌లతో కలిసి ఒకే రూంలో డిన్నర్ చేసారు. దీదీకి అంత తొందర ఏముంది? దీదీ వేరే ఉద్దేశంతో ఏమైనా డిన్నర్‌కి వెళ్లారా “” అని అధిర్ ప్రెస్ మీట్ పెట్టి మమతా బెనర్జీని ప్రశ్నించారు. దీనిపై TMC గట్టిగా సమాధానం ఇచ్చింది. ఇండియా కూటమిని నిర్మించినవారిలో మమతా బెనర్జీ ఒకరని అలాంటి ఆమెను ప్రశ్నించే హక్కు ఎవ్వరికీ లేదని అన్నారు. ఎప్పుడు ఎలా నడుచుకోవాలో ఒక సీనియర్ సీఎంకు మరొకరు చెప్పాల్సిన అవసరం లేదని మండిపడ్డారు.