Spiritual: ఎన్నో లాభాల‌ను క‌లిగించే ప్ర‌దోష వ్ర‌తం

మ‌నం ఎన్నో వ్రతాల గురించి వినే ఉంటాం. ఇంట్లో ఆడ‌వాళ్లు ఎన్నో ర‌క‌ర‌కాల వ్ర‌తాలు చేస్తూ ఉంటారు. కానీ ఈ ప్ర‌దోష వ్ర‌తం గురించి ఎప్పుడైనా విన్నారా? అస‌లు ఈ ప్ర‌దోష వ్ర‌తం అంటే ఏంటో.. ఎందుకు చేస్తారో తెలుసుకుందాం. (spiritual)

ప్ర‌దోష వ్ర‌తం అంటే ఏంటి?

ప్ర‌తి నెల‌లో వ‌చ్చే త్ర‌యోద‌శి తిథి నాడు ఈ ప్ర‌దోష వ్ర‌తం చేస్తుంటారు. ప్ర‌దోష వ్ర‌తం చేసేట‌ప్పుడు శివుడ్ని పూజిస్తే సుఖ‌సంతోషాలు క‌లుగుతాయ‌ని న‌మ్ముతారు. ఈ నెల‌లో ప్ర‌దోష వ్ర‌తం ఈరోజే వ‌చ్చింది. ఈ ప్ర‌దోష వ్ర‌తం రోజున రెండు ముఖ్య‌మైన యోగాలు ఉంటాయ‌ట‌. ఒక‌టి శివ యోగ‌, మ‌రొక‌టి స‌ర్వార్థ సిద్ధి యోగ.

ఎలా పూజ చేయాలి?

ప్ర‌దోష వ్ర‌తం రోజున ఉద‌యాన్నే లేచి స్నానాలు ఆచ‌రించి శివుడు, పార్వ‌తి, గ‌ణ‌నాథుల‌ను పూజించాలి. ఆవు నెయ్యితో దీపాలు వెలిగించి కుదిరితే విగ్ర‌హాల‌కు గంగాజ‌లంతో అభిషేకాలు నిర్వ‌హించాలి. బిల్వ ప‌త్రాలు, ర‌క‌ర‌కాల పూలతో శివ‌య్య‌ను ఆరాధిస్తే మంచిది. ఈ ప్ర‌దోష వ్ర‌తం స‌మ‌యంలో శివుడిని, ఆంజ‌నేయుడిని క‌లిపి పూజిస్తే అన్ని స‌మ‌స్యలు దూరం అవుతాయ‌ట‌. జాత‌కాల్లో ఏవైనా దోషాలు ఉంటే కూడా పోతాయ‌ట‌.  (spiritual)