Roja: చంద్రబాబుకి సాయం చేస్తాం.. లెటర్ రాసిస్తారా?
స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో రాజమండ్రి సెంట్రల్ జైలులో 14 రోజుల పాటు రిమాండ్‌లో ఉన్న చంద్రబాబు నాయుడుకి (chandrababu naidu) మేం సాయం చేస్తాం అంటూ బంపర్ ఆఫర్ ఇచ్చారు రోజా (roja).
“” స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో ఎలాంటి అవినీతి జరగలేదు నేను ఏ తప్పూ చేయలేదు అని బెయిల్‌పై ఒకవేళ చంద్రబాబు రిలీజ్ అయ్యాక మాకు ఒక లెటర్ రాసి ఇస్తే.. దానిని మేం జగన్ వద్దకు తీసుకెళ్లి క్యాబినెట్ మీటింగ్‌లో ప్రవేశపెట్టి.. ఈడీ, సీబీఐతో ప్రత్యేకంగా దర్యాప్తులు జరిపిస్తాం. మరి ఆ దమ్ము చంద్రబాబుకు ఉందా? లేదు కాబట్టే నిన్న కోర్టులో తన వాదనలు తానే వినిపించుకున్నప్పుడు కూడా ఈ స్కిల్ డెవలప్మెంట్లో ఏ స్కాం జరగలేదు నేను చేయలేదు అని చెప్పకుండా ఇందులో టెక్నికల్ లోపాలు ఉండటం వలన అధికారిక ప్రభుత్వం తప్పుడు కేసులు బనాయించిందని చెప్పుకున్నారు. చంద్రబాబు నాయుడికి ప్రాణహాని ఉందని అంటున్నారు
ప్రాణాలు తీసే వ్యక్తికి ప్రాణహాని ఎలా ఉంటుంది? ఆయన పాపి చిరాయువు. ఆయన చేసిన తప్పులకు జైలులో శిక్ష అనుభవించాల్సి ఉంది కాబట్టే అలిపిరిలో ప్రమాదం జరిగినా కూడా బతికి బయటపడ్డాడు. లేదంటే అప్పుడే పోయేవాడు. ఈరోజు TDP కార్యకర్తలు జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడలేదని అంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్‌ను, ఆయన తండ్రిని ప్రచారాల కోసం వాడుకుని తీరా పదవులు ఇవ్వకుండా అసలు వారిని లెక్కచేయకపోతే వారెందుకు వచ్చి మాట్లాడతారు. మీకు నచ్చినప్పుడు ప్రత్యేక విమానాల్లో రావడం, మీకు ఇచ్చిన స్క్రిప్ట్‌లు చదవడం ప్యాకేజ్ తీసుకుపోవడం వంటివి చేస్తూ ఉండాలా? ఎవ్వరికీ ఆత్మాభిమానం ఉండదా? (roja)
జగన్ అన్నపై అన్ని కేసులు ఉన్నాయి ఇన్ని కేసులు ఉన్నాయి ఇన్ని కుంభకోణాలు ఉన్నాయని పవన్ కళ్యాణ్ అంటున్నారు. ఆయనకు ఇదే నా ఛాలెంజ్. మీరు మా జగన్ అన్నపై ఏ కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి ఆయన ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ రోడ్డుపైకి వచ్చి దొర్లడమేంటో నాకు అర్థంకావడంలేదు. గతంలో చిరంజీవిని అరెస్ట్ చేసినప్పుడు ఎందుకు అలా రోడ్డుపైకి రాలేదు? గతంలో ముద్రగడ పద్మనాభంను అరెస్ట్ చేసినప్పుడు చంద్రబాబు పోలీసులతో అడ్డుకున్నప్పుడు ఎందుకు అలా రోడ్డుపైన దొర్లలేదు? అసలు సంబంధం లేని విషయంలో పవన్ ఇలా సపోర్ట్ చేస్తున్నాడంటే ఆయనకు కూడా ఈ షెల్ కంపెనీలతో వాటా ఉన్నట్టుండి. అన్నీ బయటకు వస్తాయి. ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు బయటికి వచ్చినా ఇంకా అమరావతి రోడ్డు అలైన్మెంట్ కేసులు, ఫైబర్‌నెట్ కేసులు కూడా ఉన్నాయి. వాటిలో ఆధారాలు దొరగ్గానే మళ్లీ జైలుకే వెళ్తాడు. ఒక్కసారి చంద్రబాబు కోర్టు బోను ఎక్కితే ఇక జైలుకే వెళ్తాడు అని నేను ఇప్పటికే వందసార్లు చెప్పాను “” అని తెలిపారు రోజా (roja)