Pawan Kalyan: జ‌గ‌న్‌ని వ‌దిలేదే లేదు

TDP అధ్య‌క్షుడు చంద్ర‌బాబు నాయుడుకి (chandrababu naidu) విజ‌య‌వాడ ఏసీబీ కోర్టు 14 రోజుల జ్యూడిషియ‌ల్ రిమాండ్ విధించిన నేప‌థ్యంలో జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ (pawan kalyan) ప్రెస్ మీట్ పెట్టారు. ఏపీ సీఎం జ‌గ‌న్‌ను (ap cm jagan) వ‌దిలిపెట్టే స‌మ‌స్యే లేద‌ని హెచ్చ‌రించారు.

“” వైజాగ్‌లో గొడ‌వ జ‌రిగిన‌ప్పుడు చంద్ర‌బాబు నాయుడు నాకు స‌పోర్ట్‌గా నిలిచారు. నాకోసం ఒక వ్య‌క్తి నిల‌బడిన‌ప్పుడు నేను కూడా ఆ వ్య‌క్తికి స‌పోర్ట్‌గా ఉండాల‌నేది నా సంస్కారం. అత‌నికి జ్యూడిషియ‌ల్ రిమాండ్ మాత్ర‌మే క‌దా విధించింది. ఇంకా దోషి అని తేల‌లేదు కదా. అప్ప‌టివ‌ర‌కు నా స‌పోర్ట్ చంద్ర‌బాబుకే. జ‌గ‌న్ ఏపీ మొత్తం త‌న చెప్పు చేత‌ల్లోనే ఉండాల‌ని అనుకుంటాడు. పోలీసులు, ఇత‌ర వ్య‌వ‌స్థ‌లు తాను చెప్పినట్లే న‌డుచుకోవాల‌ని అనుకుంటాడు. ఇదేం న్యాయం? ఇంత ప్ర‌జాద‌ర‌ణ ఉన్న న‌న్నే రోడ్డుపై వెళ్ల‌నివ్వ‌ను విమానంలో వెళ్ల‌నివ్వ‌ను అని ఆపుతున్నాడు. 40 ఏళ్ల రాజ‌కీయ చ‌రిత్ర ఉన్న మాజీ సీఎంనే రాత్రికి రాత్రి అరెస్ట్ చేయించేస్తున్నాడు. ఇది నిరంకుశ‌త్వ పాల‌న కాదా? పోలీసు వ్య‌వ‌స్థ‌ను కూడా నిర్వీర్యం చేసేసాడు. లక్ష‌ల కోట్లు నొక్కేసి, బాబాయ్‌ని హ‌త్య చేసిన‌వాడికి ఎలాంటి నోటీసులు రావు. అస‌లు స‌రైన ఆధారాలు లేకుండా ఓ మాజీ సీఎంను మాత్రం అరెస్ట్ చేసేస్తారు. 30 వేల మంది ఆడ‌పిల్ల‌లు అదృశ్య‌మయ్యారు అంటే దానికి స‌మాధానం ఉండ‌దు. దాని మీద ప్రెస్ మీట్ పెట్ట‌మంటే భ‌యం. జ‌గన్‌ని అస్స‌లు వ‌ద‌లం. అధికారంలోకి వ‌చ్చినా రాక‌పోయినా వ‌దిలిపెట్టేది లేదు “” అని ప‌వ‌న్ హెచ్చ‌రించారు. (pawan kalyan)