Chandrababu Arrest: 6 మంది గుండెపోటుతో మృతి

చంద్ర‌బాబు నాయుడిని అరెస్ట్ (chandrababu naidu arrest) చేసార‌ని తెలీడంతో ఏపీకి చెందిన దాదాపు ఆరుగురు వ్య‌క్తులు గుండెపోటుతో మృతిచెందారు. అనంతపురం జిల్లాకు చెందిన వడ్డే ఆంజనేయులు (65) చంద్రబాబు అరెస్ట్ కావడాన్ని టీవీలో చూస్తూ గుండెపోటుతో మృతిచెంద‌గా.. కోనసీమ జిల్లాకు చెందిన కాకర సుగుణమ్మ (65) చంద్రబాబు అరెస్టును తన మనవడు సెల్ ఫోన్లో చూపిస్తుండ‌గా గుండెపోటుతో కుప్ప‌కూలిపోయింది. కోనసీమ జిల్లాకు చెందిన చెల్లుబోయిన నరసింహ రావు (62), విజయనగరం జిల్లాకు చెందిన రైతు పైడితల్లి (67) చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఆందోళనకు బయలుదేరి గుండెపోటుతో మృతిచెందారు. కృష్ణా జిల్లాకు చెందిన కొడాలి సుధాకర్ రావు (60), తిరుపతి జిల్లాకు చెందిన వెంకటరమణ (46) టీవీలో చంద్రబాబు అరెస్ట్ వార్తలు చూస్తూ గుండెపోటుతో మృతిచెందారు.