PM Bilateral Meet: దేశాధినేత‌ల‌తో మోదీ స‌మావేశాలు

జీ20 స‌మ్మిట్‌లో (g20 summit) భాగంగా దేశ రాజ‌ధాని ఢిల్లీలో ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ.. (narendra modi) వివిధ దేశాధినేత‌ల‌తో ద్వైపాక్షిక స‌మావేశంలో పాల్గొన్నారు (pm bilateral meet). బ్రిట‌న్ ప్ర‌ధాని రిషి సునాక్‌తో మీటింగ్ అయ్యాక మోదీ.. జ‌పాన్ ప్ర‌ధాని ఫుమియో కిషిదాతోనూ (fumio kishida) స‌మావేశం కానున్నారు. అంతేకాకుండా మారిషస్ ప్ర‌ధాని ప్ర‌వీంద్ కుమార్ జ‌గ్నౌత్ (pravind kumar jugnaut), బంగ్లాదేష్ ప్ర‌ధాని షేక్ హ‌సీనా (sheik haseena), అమెరికా అధ్య‌క్షుడు జో బైడెన్‌తోనూ (joe biden) స‌మావేశం అవుతారు. ద్వైపాక్షిక స‌మావేశాలు ఎప్పుడూ కూడా ఇరు దేశాల మ‌ధ్య స‌త్సంబంధాల‌ను పెంచ‌డానికి ఉప‌యోగ‌ప‌డ‌తాయ‌ని మోదీ అభిప్రాయ‌ప‌డ్డారు.

ఈరోజు రేపు జ‌ర‌గ‌నున్న G20 స‌మ్మిట్‌లో మొత్తం 30 దేశాల‌కు చెందిన నేత‌ల‌తో స‌మావేశం కానున్న‌ట్లు మోదీ ట్విట‌ర్ ద్వారా వెల్ల‌డించారు. ఈరోజు ప్ర‌పంచ దేశాధినేత‌లు ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌లో ఉన్న మ‌హాత్మా గాంధీ విగ్ర‌హానికి నివాళులు అర్పిస్తార‌ని తెలిపారు. రేపు G20 స‌మ్మిట్‌కి చివ‌రి రోజు కాబ‌ట్టి దేశాధినేత‌లు ఒకే భూమి ఒకే కుటుంబం అనే అంశం గురించి త‌మ అభిప్రాయాల‌ను వెల్ల‌డిస్తార‌ని పేర్కొన్నారు. ఈరోజు సాయంత్రం ముగ్గురు దేశాధినేత‌ల‌తో (బ్రిట‌న్, జ‌పాన్ జ‌ర్మ‌నీ, ఇటలీ) మోదీ స‌మావేశం కానున్నారు. ఈ స‌మావేశం ఢిల్లీలోని ప్ర‌ధాని అధికారిక నివాసంలో జ‌ర‌గ‌నున్నాయి. ఇక రేపు ఫ్రాన్స్ అధ్య‌క్షుడు మాక్రోన్ ఇమ్మాన్యుయ‌ల్‌తో మోదీ లంచ్‌లో పాల్గొంటారు. కెన‌డా ప్ర‌ధాని జ‌స్టిన్ ట్రూడో, కొమోరోస్, ట‌ర్కీ, యూఏఈ, సౌత్ కొరియా, బ్రెజిల్, నైజీరియా, ఐరోపా దేశాల నేత‌ల‌తోనూ స‌మావేశం కానున్నారు. (pm bilateral meet)