Ekadashi రోజున ఏం తినాలి ఏం తినకూడదు?
ప్రతి నెలలో వచ్చే ఏకాదశి తిథి (ekadashi) ఎంతో పవిత్రమైనది. నెలలో రెండుసార్లు వచ్చే ఏకాదశి నాడు మాత్రం ప్రత్యేకమైన పూజలు చేసి ఉపవాసం చేస్తుంటారు. అసలు ఏకాదశి రోజున ఏం తినాలి ఏం తినకూడదు అనే విషయాలు తెలుసుకుందాం.
ఫలహారం
ఏకాదశి నాడున ఫలాలు తినడం ఉత్తమం. మామిడి, ద్రాక్ష, అరటిపండ్లు, బాదం వంటివి తీసుకోవచ్చు. కానీ క్యరెట్. కీరా వంటి కూరగాయలు మాత్రం తీసుకోకూడదు. (ekadashi)
జలహారి
జలహారి అంటే జలాన్ని ఆహారంగా తీసుకోవడం. ఆకలి వేసినప్పుడల్లా నీళ్లు తాగుతూ కటిక ఉపవాసం చేసేవారు కూడా ఉంటారు. నిర్జల ఏకాదశి నాడు ఈ జలహారి ఉపవాసాన్ని పాటిస్తుంటారు.
క్షీరభోజి
క్షీరం అంటే పాలు. ఉపవాసం ఉన్న సమయంలో పాలు తీసుకోవచ్చు. పాల ఉత్పత్తి అయిన మజ్జిగ కూడా సేవించవచ్చు. (ekadashi)
నక్తభోజి
నక్తభోజి అంటే సిరి ధాన్యాలు, తృణధాన్యాలు, బియ్యం, కూరగాయలు లేకుండా వండిన భోజనం. ఇలాంటి భోజనాన్ని ఒకపూట చేసి మిగతా సమయంలో ఉపవాసం ఉంటారు. సాబుదానా, మఖానా, ఆలుగడ్డలు, పల్లీలను ఈ నక్తభోజిలో తీసుకోవచ్చు.
ఏవి తినకూడదు?
అన్నం, మాంసం, ఉల్లిపాయ, వెల్లుల్లి, పప్పు దినుసులు వంటివి అస్సలు ముట్టకూడదు. తెలీక ఒక చిన్న ముక్క నోట్లోకి వెళ్లినా ఆ రోజు చేసే ఉపవాసానికి ఫలితం ఉండదు. టీ, కాఫీలకు కూడా దూరంగా ఉండాలని అంటారు. ఏకాదశి కోసం ప్రసాదం తయారుచేసే మాటైతే.. ఆ ప్రసాదాన్ని ఆవు నెయ్యితో తయారుచేయడం ఉత్తమం. పల్లీ నూనెతో కానీ మరే రిఫైన్డ్ నూనెతో కానీ ప్రసాదాన్ని వండకూడదు. (ekadashi)