Chandrababu భ‌ద్ర‌తా సిబ్బందినీ స‌రెండర్ చేయాల‌ట‌

సాఫ్ట్ స్కిల్ స్కాంలో అరెస్ట్ అయిన చంద్రబాబు నాయుడి (chandrababu) కేంద్ర భద్రత సిబ్బందిని కూడా DGP కార్యాలయంలో సరెండ‌ర్ చేయాల‌ని నోటీసులు జారీ చేశారు. నంద్యాల‌లో ప‌ర్యట‌న‌లో ఉన్న టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడిని ఏపీ సీఐడీ అధికారులు ఈరోజు తెల్ల‌వారుజామున అదుపులోకి తీసుకున్న సంగ‌తి తెలిసిందే. అర్థ‌రాత్రి 1 గంట నుంచి నంద్యాల‌లో హైడ్రామా జ‌రిగింది. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, ఏ త‌ప్పు చేసాను, ఉందా అని చంద్ర‌బాబు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెప్ప‌లేక పోలీసులు త‌ల‌ప‌ట్టుకున్నారు. అరెస్ట్ చేయ‌డానికి కావాల్సిన‌వ‌న్నీ చూపించిన త‌ర్వాత చంద్ర‌బాబు వారికి స‌హ‌క‌రించారు. ఆయ‌న ఆరోగ్యం బాలేదని చెప్ప‌డంతో అప్ప‌టిక‌ప్పుడు వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించి ఆయ‌న కారులోనే విజ‌య‌వాడ‌కు త‌ర‌లించారు. ఆయ‌న్ను కోర్టులో ప్రవేశ‌పెట్ట‌నున్నారు అని కొంద‌రు అంటుంటే.. మ‌రికొన్ని గంట‌ల పాటు పోలీసుల విచార‌ణ‌లో ఉంచ‌నున్నార‌ని మ‌రికొంద‌రి వాద‌న‌. (chandrababu naidu arrest)