Morocco Earthquake: 600కి చేరిన మృతుల సంఖ్య
మొరాకో (morocco earthquake) దేశాన్ని తీవ్ర భూకంపం కబళించింది. మారాకేష్ ప్రాంతంలో తెల్లవారుజామున సంభవించిన భారీ భూకంపానికి భారీ భవనాలు పేకముడల్లా కుప్పకూలిపోయాయి. ఈ దారుణ ఘటనలో ఇప్పటివరకు 600 మంది మృత్యువాతపడినట్లు తెలుస్తోంది. మృతదేహాలు శిథిలాల కింద చిక్కుకుని ఉన్నాయి. దాంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. స్థానిక హాస్పిటల్స్‌లో వందలాది మందికి చికిత్సలు అందిస్తున్నారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.2 శాతంగా నమోదైంది. మొరాకోలో గత 120 ఏళ్లలో ఇంతటి తీవ్రతతో భూకంపం సంభవించింది లేదని అధికారులు చెప్తున్నారు. బాధితులకు భారత ప్రధాని నరేంద్ర మోదీ (narendra modi) సంతాపం తెలిపారు. ఎలాంటి సాయం చేయడానికైనా సిద్ధంగా ఉన్నట్లు హామీ ఇచ్చారు. (morocco earthquake)