Nadendla Manohar: మేం చంద్ర‌బాబుకి అండగా ఉంటాం

స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ స్కాంలో అరెస్ట్ అయిన చంద్ర‌బాబు నాయుడుకి (chandrababu naidu) జ‌న‌సేన‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ (pawan kalyan) అండ‌గా ఉంటామ‌ని అన్నారు నాదెండ్ల మ‌నోహ‌ర్ (nadendla manohar). జ‌గ‌న్ ఏపీకి సీఎం అయిన మొద‌టి రోజు నుంచే ఎలాగోలా ఏదో ఒక కేసును చంద్ర‌బాబు నాయుడు మీద పెట్టి ఆయ‌న్ను జైలుకు పంపించాల‌ని ప్లాన్ వేస్తున్నారని మ‌నోహర్ ఆరోపించారు. జ‌న‌సేన కార్య‌క్ర‌మాలు ఏర్పాటుచేసుకున్నా కూడా ప్ర‌శాంతంగా జ‌ర‌గ‌నివ్వ‌కుండా పోలీసుల ద్వారా త‌మ‌ను హోట‌ల్స్‌లో నిర్భంధించార‌ని అన్నారు. ఇలా ప్ర‌జాస్వామ్యానికి వ్య‌తిరేకంగా ప‌నిచేస్తున్న జ‌గ‌న్ ప‌ట్ల ప్ర‌జ‌లు ఆగ్ర‌హంతో ఉన్నార‌ని తెలిపారు. (janasena)