TDP: ప్ర‌జాస్వామ్యానికే బ్ల్యాక్ డే

TDP అధినేత చంద్ర‌బాబు నాయుడిని (chandrababu naidu) ఏ త‌ప్పూ లేకుండా అరెస్ట్ చేయ‌డం ప్ర‌జాస్వామ్యానికే బ్ల్యాక్ డే అని అన్నారు TDP నేత‌లు. “” స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ కేసులో 26 మందిని చూపించారు కానీ చంద్ర‌బాబు నాయుడు పేరు లేదు. పేరు లేకుండా కుట్ర‌పూరితంగా G20 స‌మావేశాలు జ‌రుగుతున్న సంద‌ర్భంలో దేశ‌వ్యాప్తంగా పేరు మోసి రాజ‌కీయాలు నిర్వ‌హించి కేంద్ర రాష్ట్ర ప్ర‌భుత్వాల‌ను నిర్దేశించిన వ్య‌క్తిని ప్ర‌పంచ‌వ్యాప్తంగా అన్‌పాపుల‌ర్ చేయాల‌న్న ఉద్దేశంతో ప్ర‌భుత్వం ప‌న్నిన కుట్ర అది. ఎన్నిక‌లు రాబోతున్నాయి. వ్య‌తిరేక గాలులు వీస్తున్నాయ‌ని తెలిసి ఈ స‌మ‌యంలో చంద్ర‌బాబుని అరెస్ట్ చేస్తే ప్ర‌జ‌ల స‌పోర్ట్ త‌మ‌కే ఉంటుంద‌ని పొర‌పాటు పడ్డారు “” అని మండిప‌డుతున్నారు.