Perni Nani: చంద్ర‌బాబుకి తండ్రెవరో తెలీదు

TDP అధినేత చంద్ర‌బాబు నాయుడుకి (chandrababu naidu) త‌న తండ్రెవ‌రో చెప్పుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నాడ‌ని విమ‌ర్శించారు YCP నేత పేర్ని నాని (perni nani). ఏపీ సీఎం జ‌గ‌న్‌ది (ap cm jagan) నీతిలేని పుట్టుక అని చంద్ర‌బాబు వ్యాఖ్యానించ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. దీనిపై పేర్ని నాని మాట్లాడుతూ.. అస‌లు చంద్ర‌బాబు నాయుడుకి త‌న తండ్రెవ‌రో తెలీద‌ని.. అలాంటి ఆయ‌న రోజూ నా తండ్రి రాజ‌శేఖ‌ర్ రెడ్డి నా త‌ల్లి విజ‌య‌మ్మ అని వంద‌ల సార్లు చెప్పుకునే జ‌గ‌న్‌పై నింద‌లు వేయ‌డం హాస్యాస్ప‌దంగా ఉంద‌ని అన్నారు. ఎంతసేపు నేను NTR అల్లుడి అని చెప్పుకుంటాడే త‌ప్ప నేను ఫ‌లానా వాడి కొడుకుని అని ఎప్పుడూ చెప్పుకోని వ్య‌క్తి చంద్ర‌బాబు అని, త‌ల్లిదండ్రులు చ‌నిపోయిన‌ప్పుడు త‌ల‌కొరివి పెట్ట‌కుండా జుట్టు తీయ‌కుండా ఉన్న‌వాడు జ‌గ‌న్‌ని తిట్ట‌డ‌మేంటి అని మండిప‌డ్డారు (perni nani)