Kamal Haasan: ఉదయనిధి స్టాలిన్‌కు కమల్ సపోర్ట్
సనాతన ధర్మంపై (sanatana dharma) వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన DMK నేత ఉదయనిధి స్టాలిన్‌కు (udayanidhi stalin) మద్దతుగా నిలిచారు మక్కల్ నీది మయం (MNM) అధినేత కమల్ హాసన్ (kamal haasan). ఒక వ్యక్తి సమాజాన్ని ప్రశ్నించినప్పుడు అది నచ్చిన వారు సపోర్ట్ చేయాలని నచ్చకపోతే న్యాయపరంగా చర్చించాలని అన్నారు.
“” నిజమైన ప్రజాస్వామ్య ముఖ్య లక్షణం దేశ పౌరులు ఒక విషయాన్ని ఏకీభవించకుండా నిరంతర చర్చలో పాల్గొనడమే. ముఖ్యమైన ప్రశ్నలు అడిగినప్పుడే సమాజం అభివృద్ధికి దోహదపడే సమాధానాలు వస్తాయని మనకు చరిత్ర పదే పదే గుర్తుచేస్తోంది. ఉదయనిధి స్టాలిన్‌కి సనాతన ధర్మంపై తన అభిప్రాయాన్ని వెల్లడించే హక్కు ఉంది. ఒకవేళ అతని అభిప్రాయం మీకు నచ్చకపోతే సనాతన ధర్మానికి సంబంధించిన అంశాలపై చర్చలు జరపాలి. అంతేకానీ ఇలా కేసులు పెట్టడం, బెదిరింపులకు పాల్పడటం సబబు కాదు. ఆరోగ్యకరమైన డిబేట్లు పెట్టడంతో తమిళనాడు ఎప్పుడూ ముందుంది. ఇకముందు కూడా ఇలాగే ఉంటుంది. మన సంప్రదాయాలు, సమానత్వం, అభివృద్ధి వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని చర్చించాలి. మెరుగైన సమాజం కోసం అవసరమైన చర్చలకు పిలుపునిద్దాం “” అని వెల్లడించారు కమల. (kamal haasan)