Modi Biden Meet: అమెరికా అలాంటి బేరాలు ఆడదు
ఈరోజు అమెరికాలోని వైట్ హౌస్‌లో (white house) ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (modi biden meet) ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొననున్నారు. యావత్ భారతదేశం కళ్లన్నీ ఇప్పుడు ఈ మీటింగ్‌పైనే ఉన్నాయి. ఈ మీటింగ్‌లో భాగంగా 6G, ప్రిడేటర్ డ్రోన్స్, జెట్ ఇంజిన్ డీల్ గురించి చర్చించనున్నట్లు అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సల్లీవాన్ తెలిపారు. అయితే ఇండియా, అరబ్ దేశాల మధ్య రైలు డీల్ గురించి మాత్రం జేక్ ఎలాంటి సమాచారం ఇవ్వలేదు.
“” భారతదేశం నుండి, మధ్యప్రాచ్యం అంతటా, ఐరోపాకు దేశాల వరకు రైలు కనెక్టివిటీ చాలా ముఖ్యమైన ప్లాన్. ఇందులో పాల్గొన్న అన్ని దేశాలకు గణనీయంగా ఆర్థిక, వ్యూహాత్మక ప్రయోజనాలను కలిగిస్తుందని మేం అభిప్రాయపడుతున్నాం. కానీ ఈ వారాంతంలో ఏవైనా సంభావ్య ప్రకటనలకు సంబంధించిన విషయాలు గురించి ఇప్పుడే ఏమీ చెప్పలేను. ఈ ప్రతిపాదనకు అన్ని దేశాలు సిద్ధంగా, బాధ్యతగా ఉంటే అప్పుడు ఈ డీల్ జరుగుతుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. అమెరికా మాత్రం తన వంతు ఏం చేయాలనుకుంటోందో అది చేసి తీరుతుంది. ప్రస్తుతం చాలా దేశాలు ఉక్రెయిన్ గురించి, వాతావరణ మార్పుల గురించి ఆలోచిస్తున్నాయి. చమురు ప్రొడ్యూస్ చేసే దేశాలు వాతావరణ మార్పుల గురించి ఒక వాదన విపిస్తున్నాయి. మరికొన్ని దేశాలు దీనిపై స్ట్రాంగ్ కమిట్మెంట్ కావాలని అంటున్నాయి. ఇంకోపక్క చైనా టెక్నాలజీని ఉపయోగించి వాతావరణ మార్పులపై ఒక నిర్ణయానికి రావాలని ప్రయత్నిస్తోంది. అయితే వాతావరణ మార్పుల విషయాన్ని ఇతర విషయలతో పోల్చడం సరికాదు. వాతావరణ మార్పులకు సంబంధించిన అంశాలు చాలా సున్నితమైనవని. ఇలాంటి అంశాలను ఇతర అంశాలతో బేరాలు ఆడకూడదు. అమెరికా ఇలాంటి బేరాలను అస్సలు సహించదు. “” అని జేక్ అన్నారు. (modi biden meet)