September Releases: మూవీ ల‌వ‌ర్స్‌కి పండ‌గే…!

ఈ సెప్టెంబ‌ర్‌లో వ‌రుస‌గా నాలుగు సినిమాలు రిలీజ్ అవ‌నున్నాయి. ఇక సినిమా ల‌వ‌ర్స్‌కి పండ‌గే అని చెప్పాలి. ఇంత‌కీ సెప్టెంబ‌ర్‌లో ఏ సినిమాలు రిలీజ్ కానున్నాయంటే… (september releases)

చంద్ర‌ముఖి 2 (chandramukhi 2)

ఒక‌ప్పుడు సూప‌ర్‌స్టార్ ర‌జినీకాంత్ (rajinikanth), జ్యోతిక (jyothika) న‌టించిన చంద్రముఖి సినిమాకు సీక్వెల్ తీసుకొస్తున్నారు రాఘ‌వ లారెన్స్ (raghava lawrence). ఇందులో కంగ‌న రనౌత్ (kangana ranaut) చంద్ర‌ముఖి క్యారెక్ట‌ర్‌లో న‌టిస్తున్నారు. నిజానికి ఈ సినిమా సెప్టెంబ‌ర్ 14న రిలీజ్ కావాల్సి ఉంది. కొన్ని కార‌ణాల వ‌ల్ల సినిమాను సెప్టెంబ‌ర్ 28కి పోస్ట్‌పోన్ చేసారు.

రూల్స్ రంజన్‌ (rules ranjan)

గ్యాప్ లేకుండా వ‌రుస సినిమాల‌తో దూసుకెళ్తున్నాడు కిర‌ణ్ అబ్బ‌వ‌రం (kiran abbavaram). ఆయ‌న నేహా శెట్టి నటించిన రూల్స్ రంజ‌న్ కూడా సెప్టెంబ‌ర్ 28న రిలీజ్ కానుంది. నిజానికి ఈ తేదీన రెబెల్ స్టార్ ప్ర‌భాస్ (prabhas) యాక్ట్ చేసిన స‌లార్ (salaar) రిలీజ్ కావాల్సి ఉంది. కానీ వ‌ర్క్ బాలేద‌ని సినిమాను నవంబ‌ర్‌కు పోస్ట్‌పోన్ చేసారు. దాంతో ఈ డేట్‌ను రూల్స్ రంజ‌న్ మేక‌ర్స్ లాక్ చేసుకున్నారు. (september releases)

స్కంద‌ (skanda)

రామ్ పోతినేని (ram pothineni) బోయ‌పాటి శీను (boyapati sreenu) కాంబినేష‌న్‌లో వ‌స్తున్న సినిమా ఇది. ఈ సినిమాను కూడా 28న రిలీజ్ చేయ‌నున్నారు. రామ్, శ్రీలీల (sreeleela) యాక్ట్ చేసిన ఈ సినిమాకు పైసా వసూల్ చేసుకోడానికి ఇదే మంచి స‌మ‌యం. మ‌న టాలీవుడ్ నుంచి వ‌స్తున్న కాస్త పెద్ద సినిమా ఏద‌న్నా ఉందంటే అది స్కంద‌. ఇప్ప‌టినుంచి రామ్ పోతినేని, శ్రీలీల ప్ర‌మోషన్స్ స్టార్ట్ చేసి అనుకున్న‌ట్లుగానే 28కి సినిమాను రిలీజ్ చేస్తే పైసా వ‌సూల్ అయ్యే అవ‌కాశాలు ఉన్నాయి.

మ్యాడ్ (mad)

ఇక 28న వ‌స్తున్న సినిమాల్లో మ్యాడ్ ఒక‌టి. చిన్న సినిమానే అయిన‌ప్ప‌టికీ ఇటీవ‌ల రిలీజ్ అయిన ట్రైల‌ర్‌కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. కాక‌పోతే 28న చంద్ర‌ముఖి 2, స్కంద ఉండ‌టంతో పోస్ట్‌పోన్ చేస్తార‌న్న టాక్ న‌డుస్తోంది. (september releases)

పెద‌కాపు 1 (pedakapu 1)

శ్రీకాంత్ అడ్డాల (srikanth addala) డైరెక్ష‌న్‌లో వ‌స్తున్న పెద‌కాపు 1 సినిమాను సెప్టెంబ‌ర్ 29న రిలీజ్ చేయ‌నున్నారు. ఇందులో నాగేంద్ర‌బాబు, ఈశ్వ‌రి రావు, త‌నికెళ్ల భ‌ర‌ణి కీ రోల్స్ ప్లే చేసారు. టీజ‌ర్‌, ట్రైల‌ర్ గ్రిప్పింగ్‌గానే ఉన్నాయి. సోలో రిలీజ్ అయినా కూడా స్కంద‌, చంద్ర‌ముఖి 2 డామినేష‌న్ ఉంటుంది. అయినా కూడా త‌న సినిమాపై ఎంతో కాన్ఫిడెంట్‌గా ఉన్నారు శ్రీకాంత్ అడ్డాల‌.