Chanakya Neeti: వీరికి దూరంగా ఉంటే మంచిది
ఆచార్య చాణక్యుడు కొందరు వ్యక్తులకు దూరంగా ఉండాలని చెప్తుండేవారు. అలాంటి వ్యక్తుల వల్లే మన జీవితంలో నెగిటివిటీ పెరిగిపోతుందట. అసలు ఈ విషయంలో చాణక్యుడు చెప్పిన నీతి ఏంటో తెలుసుకుందాం. (chanakya neeti)
ఆచార్య చాణక్య నీతి శాస్త్రం ప్రకారం.. అతి తెలివి ప్రదర్శిస్తూ.. ఎప్పుడూ ఏదో ఒకటి ఆశించే వ్యక్తులకు దూరంగా ఉండాలట. ఎందుకంటే వారికి తెలివి తేటలు ఉన్నాయని తెలిసి మనకు ఏదైనా అవసరం వచ్చి సలహా అడగాలని చూస్తే వారు మనల్నే ముంచేస్తారట. అంతేకాదు.. స్వార్థంగా ఆలోచిస్తూ పైకి మాత్రం మన మంచి కోసమే చెప్తున్నా అనే రకాలను మనం కనిపెట్టగలగాలి. ఇలాంటివారు విషసర్పాలతో సమానం. ఎప్పుడూ కోపంగా.. అమర్యాదకరంగా మాట్లాడేవాళ్లకు కూడా దూరంగా ఉండాలి. ఎందుకంటే వీరి పక్కన ఉంటే మనకి కూడా లేని పోని చిరాకు వస్తుంది. మనం ఎంత పాజిటివ్‌గా ఉండాలనుకున్నా వీరిని చూస్తే మన ముఖంలో చిరునవ్వు పోతుంది. (chanakya neeti)
ఒకవేళ మీకు ఏదన్నా సలహా కావాలన్నా లేదా ఏదైనా మంచి విషయాన్ని పంచుకోవాలనుకున్నా కోపిష్టి మనుషుల దగ్గరకు అస్సలు వెళ్లకండి. ఎందుకంటే అలాంటివారితో మీకు జరిగిన మంచి విషయాలను పంచుకుంటే వారికి జరగలేదన్న కోపం, మీకే మంచి జరుగుతోందన్న ఆసూయ కలుగుతాయి. అవి మనకు అస్సలు మంచివి కావు. దీనినే నరదిష్టి అంటారు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. మీకు తెలిసినవారిలో ఎవరైనా ఎప్పుడూ తమ గురించి తామే నెగిటివ్‌గా చెప్పుకుంటుంటే వారితో వెంటనే డిస్కనెక్ట్ అయిపోయిండి. ఇలాంటివారు ఎలా ప్రవర్తిస్తుంటారంటే.. ఎప్పుడూ తమ గురించి తాము చెడుగా చెప్పుకుంటే వెంటనే మంచి జరుగుతుందన్న పిచ్చి నమ్మకంతో ఉంటారు వీరు. ఇలాంటివారితో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. (chanakya neeti)