Mahesh Babu: యూట్యూబ్‌లో మ‌హేష్ సినిమా రికార్డ్!

సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు (mahesh babu) న‌టించిన ఓ సినిమా యూట్యూబ్‌లో రికార్డ్ సృష్టించింది. 200 ప్ల‌స్ మిలియ‌న్ వ్యూస్‌తో అత్య‌ధిక వ్యూస్ సాధించిన ఏకైక తెలుగు సినిమాగా రికార్డ్ నెల‌కొల్పింది. ఇంత‌కీ అదేం సినిమా అనుకుంటున్నారా.. శ్రీమంతుడు (srimanthudu). కొర‌టాల శివ (koratala siva) డైరెక్ట్ చేసిన శ్రీమంతుడు సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర నాన్ బాహుబ‌లి రికార్డ్ సాధించింది. ఇప్పుడు ఈ సినిమా యూట్యూబ్‌లో కూడా దుమ్మురేపుతోంది. శ్రుతి హాస‌న్, మ‌హేష్ జంట‌గా న‌టించిన ఈ సినిమాకు ఎంత ఆద‌ర‌ణ ల‌భించిందంటే.. ఈ సినిమా రిలీజ్ అయ్యాక మ‌హేష్‌తో స‌హా ఎంద‌రో పొలిటికల్, సినీ సెల‌బ్రిటీలు ఊర్ల‌ను దత్తత తీసుకునేందుకు ముందుకొచ్చారు. (mahesh babu)