Marimuthu: డ‌బ్బింగ్ చెప్తూ చ‌నిపోయిన జైల‌ర్ న‌టుడు

ర‌జినీకాంత్ (rajinikanth) న‌టించిన‌ జైల‌ర్ (jailer) సినిమాలో ప‌న్నీర్ క్యారెక్ట‌ర్‌లో న‌టించిన త‌మిళ న‌టుడు మారిముత్తు (58) (marimuthu) ఈరోజు ఉద‌యం గుండెపోటుతో మృతిచెందారు. ఓ త‌మిళ టీవీ షో కోస‌మ‌ని ఈరోజు ఉద‌యం 8 గంట‌ల‌కు డ‌బ్బింగ్ స్టూడియోకి వెళ్లిన మారిముత్తు డ‌బ్బింగ్ చెప్తూ గుండెపోటుకు గుర‌య్యారు. వెంట‌నే ఆయ‌న్ను ద‌గ్గ‌ర్లోని హాస్పిట‌ల్‌కు తీసుకెళ్ల‌గా అప్ప‌టికే చ‌నిపోయిన‌ట్లు వైద్యులు తెలిపారు. జైల‌ర్ సినిమాలో ప్ర‌ధాన విల‌న్ వ‌ర్మ ప‌క్క‌న ఉన్న ఇద్ద‌రు వ్య‌క్తుల్లో మారిముత్తు ఒక‌రు. ఇత‌ను సినిమా మొత్తం అయ్య‌ప్ప మాల‌లోనే క‌నిపించారు. (marimuthu)