Jawan OTT Release: ఎప్పుడో తెలుసా?

షారుక్ ఖాన్ (shahrukh khan) న‌టించి బ్లాక్ బ‌స్ట‌ర్ జ‌వాన్ (jawan ott release) సినిమా OTTలో రిలీజ్ అవ‌బోతోంది. అట్లీ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను నెట్‌ఫ్లిక్స్ (netflix) కొనుగోలు చేసిన‌ట్లు తెలుస్తోంది. షారుక్ ప్రొడ‌క్ష‌న్ హౌస్ రెడ్ చిల్లీస్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌కి అమెజాన్ ప్రైం, డిస్నీ హాట్‌స్టార్, జీ 5, వూట్, సోనీ లివ్ ప్లాట్‌ఫాంల‌తో మంచి క‌నెక్ష‌న్ ఉంది. ఫైన‌ల్‌గా జ‌వాన్ హ‌క్కుల‌ను నెట్‌ఫ్లిక్స్ ద‌క్కించుకున్న‌ట్లు స‌మాచారం. జ‌వాన్ సాటిలైట్ రైట్స్ రూ.250 కోట్ల‌కు అమ్ముడుపోయాయట‌.

అయితే షారుక్ జ‌వాన్ కంటే ముందు న‌టించిన ప‌ఠాన్ (pathaan) సినిమాను అమెజాన్ ప్రైంకు అమ్మారు. ఎందుకంటే అది వైఆర్ఎఫ్ ప్రొడ‌క్ష‌న్ హౌస్ తీసిన సినిమా. కానీ రెడ్ చిల్లీస్‌కి సంబంధించిన సినిమాల‌న్నీ నెట్‌ఫ్లిక్స్‌కే అమ్ముతూ వ‌స్తున్నారు. ప‌ఠాన్ థియేట‌ర్‌లో రిలీజ్ అయిన 56 రోజుల త‌ర్వాత ప్రైంలో రిలీజ్ అయింది. ఇప్పుడు దీపావ‌ళి త‌ర్వాతే OTTలోకి వ‌చ్చే అవ‌కాశం ఉంది. సెప్టెంబ‌ర్ 7న రిలీజ్ అయిన జ‌వాన్.. తొలి రోజే రూ.70 కోట్ల నెట్ క‌లెక్ష‌న్లు రాబ‌ట్టింది. భార‌త‌దేశంలో ఏ బాలీవుడ్ సినిమాకు కూడా ఈ రేంజ్‌లో ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్ రాలేద‌ట‌. (jawan ott release)