Shahrukh Khan: నీతో క‌లిసి సినిమా చూస్తా మ‌హేష్‌..!

త్వర‌లో రిలీజ్ అవ‌నున్న జ‌వాన్ (jawan) సినిమాను సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబుతో (mahesh babu) క‌లిసి చూడాలనుకుంటున్నారు షారుక్ ఖాన్ (shahrukh khan). మ‌హేష్ ఎప్పుడు సినిమా చూడాల‌నుకుంటున్నాడో డేట్ టైం చెప్తే త‌ను కూడా వ‌స్తాన‌ని అన్నారు. జ‌వాన్ సినిమా రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నాన‌ని.. త్వ‌ర‌లో ఫ్యామిలీతో కలిసి చూడాల‌ని అనుకుంటున్నాన‌ని మ‌హేష్ ట్వీట్ చేసారు. ఈ ట్వీట్‌కి షారుక్ రిప్లై ఇస్తూ.. ఎప్పుడు చూడ‌బోతున్నారో చెప్తే త‌ను కూడా జాయిన్ అవుతానని అన్నారు. త‌మిళ డైరెక్ట‌ర్ అట్లీ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో న‌య‌న‌తార‌, దీపిక ప‌దుకొణె హీరోయిన్లుగా న‌టించారు.

ఇప్ప‌టికే జ‌వాన్ మేనియా సౌత్ మార్కెట్ల‌లో క‌నిపిస్తోంది. సినిమా స‌క్సెస్ కోసం మొద‌టిసారి షారుక్ త‌న కూతురు సుహానాతో క‌లిసి తిరుమల శ్రీవారిని కూడా ద‌ర్శించుకోవ‌డం స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది. ఇప్ప‌టికే దాదాపు 5 ల‌క్ష‌ల‌కు పైగా టికెట్లు అమ్ముడుపోయాన‌ని అంటున్నారు. మ‌రి అట్లీ మ్యాజిక్.. షారుక్ క్రేజ్.. దీపిక‌, న‌య‌న్ బ్యూటీ క‌ల‌గ‌లిపిన ఈ సినిమా ఎలా ఉందో గురువారం (సెప్టెంబ‌ర్ 7) తెలిసిపోతుంది. (shahrukh khan)