Jackie Shroff: పేరు మారిస్తే ప్ర‌జ‌లు మారిపోరు క‌దా..!

ఇండియా (india) పేరు తీసేసి మ‌న దేశానికి భార‌త్ (bharat) అని నామ‌క‌రణం చేసినంత మాత్రాన దేశంలోని ప్ర‌జ‌లు మారిపోరు క‌దా అని అంటున్నారు బాలీవుడ్ న‌టుడు జాకీ ష్రాఫ్ (jackie shroff). దేశ రాజ‌ధాని ఢిల్లీలో జ‌రిగిన ఈవెంట్‌లో పాల్గొన్న జాకీ పేరు మార్పుపై స్పందించారు. కొంద‌రు త‌న‌ని జాకీ అని కాకుండా జోకీ, జక్కీ అని పిలుస్తుంటార‌ని అంత‌మాత్రాన త‌న గుర్తింపు మారిపోద‌ని అన్నారు. అదే విధంగా ఇండియా అని తీసేసి భార‌త్ అని పెట్టినంత మాత్ర‌న ప్రజ‌లు మారిపోర‌ని అన్నారు. (jackie shroff)