Omar Abdullah: దేశం పేరు మార్చద్దు.. మేమే మార్చుకుంటాం
మన దేశానికి ఇండియా (india) అని కాకుండా భారత్ (bharat) అని పేరు మార్చేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణం.. 26 పార్టీల అపోజిషన్ కూటమికి ఇండియా (i-n-d-i-a) అని పేరు పెట్టడమే అయితే.. ఆ పేరునే మార్చుకుంటాం అని అంటున్నారు నేషనల్ కాన్ఫరెన్స్ లీడర్ ఒమర్ అబ్దుల్లా (omar abdullah) అనవసరంగా దేశం పేరు మార్చి ప్రజలను కన్‌ఫ్యూజ్ చేసే బదులు తమ కూటమి పేరు మార్చుకుంటామని.. ఇప్పటికైనా కేంద్రం తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటే బాగుంటుందని తెలిపారు.
రానున్న లోక్ సభ ఎన్నికల్లో (lok sabha elections) BJPని ఓడించేందుకు కాంగ్రెస్ (congress) మరో 25 పార్టీలతో చేతులు కలిపి ఒక కూటమిని ఏర్పాటుచేసుకుంది. ఈ కూటమికి ఇండియా (india) అని నామకరణం చేసింది. బహుశా అందుకే కేంద్రం ఇండియాను భారత్‌గా మార్చాలని అనుకుంటోందని పలువురి అభిప్రాయం.