Karnataka: ప‌రిహారం పెరగ‌డంతో రైతుల ఆత్మ‌హ‌త్య‌లు పెరిగాయ‌ట‌

ప్ర‌భుత్వం (karnataka) ఇచ్చే ప‌రిహారం పెర‌గ‌డంతో రైతుల ఆత్మ‌హ‌త్య‌లు కూడా పెరిగాయంటూ షాకింగ్ కామెంట్స్ చేసారు కర్ణాట‌క మంత్రి శివానంద్ పాటిల్ (shivanand patil).  ప్ర‌స్తుతం ఆత్మ‌హ‌త్య‌లు చేసుకున్న రైతుల కుటుంబాల‌కు క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం రూ.5 ల‌క్ష‌లు ప‌రిహారంగా ఇస్తోంది. 2015 త‌ర్వాతే ఈ ప‌రిహారం పెర‌గ‌డంతో..రైతుల ఆత్మ‌హ‌త్య‌లు కూడా పెరిగాయ‌ని పాటిల్ అన్నారు. “” 2015 కంటే ముందు ఆత్మ‌హ‌త్య‌లు చేసుకున్న రైతుల కుటుంబాల‌కు త‌క్కువ ప‌రిహారం ఉండేది. 2015 త‌ర్వాత రూ.5 ల‌క్ష‌లు ఇస్తున్నారు. దాంతో రైతుల ఆత్మ‌హ‌త్య‌లు పెరిగాయి. ఒక‌వేళ ఆ ప‌రిహారం రాక‌పోతే వేరే ర‌కంగా ప‌రిహారం తీసుకోవాల‌ని ఇత‌ర మార్గాలు వెతుక్కుంటున్నారు. 2015 ముందు వ‌ర‌కు ప‌రిహారం త‌క్కువ‌గా ఉండేది. రైతుల ఆత్మ‌హ‌త్య‌లూ త‌క్కువ‌గా ఉండేవి. ప‌రిహారం కోసం సాధార‌ణ మ‌ర‌ణాల‌ను కూడా ఆత్మ‌హ‌త్య‌లుగా చిత్రీక‌రిస్తున్నారు “” అని వ్యాఖ్యానించారు పాటిల్. (karnataka)