Uttar Pradesh: కోరిక తీర్చ‌లేద‌ని శివ‌లింగాన్ని ఎత్తుకుపోయాడు..!

గుడికి వెళ్లి స్వామి నాకు ఆ కోరిక నెర‌వేర్చు ఈ కోరిక తీర్చు అని మొక్కుకుంటూ ఉంటాం. ఆ కోరిక తీర‌క‌పోతే మ‌ళ్లీ మళ్లీ వెళ్లి మొక్కుకుంటాం. కానీ ఉత్త‌ర్‌ప్రదేశ్‌కి (uttar pradesh) చెందిన ఓ వ్య‌క్తి ఏం చేసాడో తెలుసా? ఏకంగా శివ‌లింగాన్నే (shivling) ఎత్తుకుపోయాడు. ఇందుకు కారణం తాను ఎప్ప‌టినుంచో పెళ్లి కావాల‌ని మొక్కుకుంటున్నాడ‌ట‌. ఆ కోరిక తీర్చ‌డంలేద‌న్న కోపంతో ఇలా ఏకంగా లింగాన్నే ఎత్తుకుపోయాడ‌ట‌.

కౌశంబి జిల్లాకు చెందిన చోటూ అనే వ్య‌క్తి శ్రావ‌ణ మాసం మొత్తంలో రోజూ ద‌గ్గ‌ర్లోని శివాల‌యానికి వెళ్లి త‌న‌కు త్వ‌ర‌గా పెళ్లి కావాల‌ని మొక్కుకుంటూ ఉన్నాడు. ఈ నెల రోజుల్లో ఒక్క సంబంధం కూడా కుద‌ర‌క‌పోవ‌డంతో ఎవ్వ‌రూ లేని స‌మ‌యంలో లింగాన్ని ఎత్తుకుపోయి ద‌గ్గ‌ర్లోని పొద‌ల్లో దాచాడు. ఆ గుడిలోని పూజారులు లింగం క‌నిపించ‌క‌పోవ‌డంతో షాక‌య్యారు. వెంట‌నే పోలీసుల‌కు ఫిర్యాదు చేసారు. 20 నిమిషాల పాటు వెత‌క‌గా పొద‌ల్లో లింగం క‌నిపించింది. ఇదంతా చోటు అనే యువ‌కుడు చేసిన పని అని తెలిసి అత‌న్ని 24 గంట‌ల పాటు స్టేష‌న్‌లో పెట్టారు. (uttar pradesh)