America: హైవేకి భార‌తీయ పోలీస్ పేరు..!

అమెరికాలోని (america) ఓ ర‌హ‌దారికి భార‌త సంత‌తికి చెందిన పోలీస్ పేరు పెట్ట‌నున్నారు. రోనిల్ సింగ్ (ronil singh) అనే భార‌త సంత‌తికి చెందిన వ్య‌క్తి అమెరికాలోని కాలిఫోర్నియాలో పోలీస్ ఉద్యోగం చేసేవాడు. 2018లో కాలిఫోర్నియాలో జ‌రిగిన కాల్పుల్లో రోనిల్ చ‌నిపోయారు. దాంతో అక్క‌డి ఒక హైవేకి ఆయ‌న గుర్తుగా కార్పోర‌ల్ రోనిల్ సింగ్ హైవే అని పేరు పెట్టారు. ఈ నేప‌థ్యంలో రోనిల్ కుటుంబీకుల‌ను పిలిపించి వారి చేత‌నే కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు.