Virender Sehwag: వ‌రల్డ్ క‌ప్‌కి జెర్సీపై భార‌త్ అని ఉండాలి

ఇక నుంచి మ‌న దేశాన్ని ఇండియాగా (india) కాకుండా భార‌త్ (bharat) అని పిల‌వాల‌ని కేంద్రం అన‌ధికారికంగా నిర్ణ‌యించింది. దీనిపై భిన్న అభిప్రాయాలు వెల్ల‌డ‌వుతున్నాయి. అయితే దీనిని BJP స‌పోర్ట్ చేసే వారే స‌మ‌ర్ధిస్తున్నారు కానీ మిగ‌తా వారు మండిప‌డుతున్నారు. ఈ ఐడియాను స‌పోర్ట్ చేస్తున్న వారిలో టీమిండియా మాజీ క్రికెట‌ర్ వీరేంద‌ర్ సెహ్వాగ్ (virender sehwag) కూడా ఉన్నారు. రానున్న వ‌రల్డ్ క‌ప్‌లో క్రికెట‌ర్ల‌కు జెర్సీల‌పై ఇండియా అని కాకుండా భార‌త్ అని ప్రింట్ చేయించాల‌ని అన్నారు. “” 1996లో వ‌రల్డ్ క‌ప్ జ‌రిగిన‌ప్పుడు నెద‌ర్లాండ్స్ ఆట‌గాళ్లు భార‌త్‌కి పోలాండ్ పేరుతో వ‌చ్చి ఆడారు. 2003లో మేం వారి దేశానికి వెళ్లినప్పుడు వారు నెద‌ర్లాండ్స్ పేరుతోనే ఆడారు. బ్ర‌టిష‌ర్లు మ‌య‌న్మార్‌ను బ‌ర్మాగా మార్చారు. ఆ త‌ర్వాత వారు మ‌ళ్లీ మ‌య‌న్మార్ అని మార్చేసుకున్నారు. ఇలాగే చాలా దేశాలు త‌మ ఒరిజిన‌ల్ పేర్ల‌ను పెట్టేసుకున్నాయి “” అంటూ స‌పోర్ట్ చేసారు సెహ్వాగ్. (virender sehwag)