India Bloc: ఇండియా కూటమిలో ముసలం
రానున్న లోక్ సభ ఎన్నికల్లో (lok sabha elections) NDAను కూలగొట్టి కేంద్రంలో అధికారానికి వచ్చి తీరాల్సిందేనని నడుం బిగించింది కాంగ్రెస్ (congress). ఇందుకోసం వివిధ రాష్ట్రాలకు చెందిన 28 పార్టీలను తమతో కలుపుకుని ఒక కూటమిని ఏర్పాటుచేసింది. దీనికి ఇండియా (india bloc) అని పేరు పెట్టింది. ఐకమత్యమే మహాబలం అనేది ఇండియా కూటమి నమ్ముకున్న సిద్ధాంతం. కలిసి కట్టుగా ఉంటేనే అనుకున్నది సాధిస్తామని రాహుల్ గాంధీ (rahul gandhi) ఎన్నోసార్లు చెప్పారు. చూడబోతే ఇండియా కూటమిలో (india bloc) ఆ ఐకమత్యమే కొరవడినట్లు తెలుస్తోంది.
ఇప్పటివరకు ఇండియా కూటమి నాలుగు సార్లు సమావేశమైంది. మొదటిసారి బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ (nitish kumar) నేతృత్వంలో పాట్నాలో, రెండోసారి కర్ణాటకలో, ఇక మిగతా రెండుసార్లు ముంబైలో కలిసాయి. అయితే ఈ నాలుగు మీటింగ్‌లలో కొందరు నేతలు ఇండియా కూటమి తీసుకున్న నిర్ణయాలతో అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. పట్నాలో మీటింగ్ ఏర్పాటుచేసినప్పుడు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వెళ్లిపోయారు. ఆ తర్వాత ముంబైలో జరిగిన సమావేశం నుంచి నితీష్ కుమార్ వెళ్లిపోయారు వెళ్లిపోయారు. అదేంటి అని అడిగితే.. ఫ్లైట్ టైం అయిపోతోందని వెళ్లిపోయామని అంటున్నారు. అందులో నిజం లేదు. ఎందుకంటే కేజ్రీవాల్, నితీష్ కుమార్‌కి కమర్షియల్ విమానాలు కాకుండా సొంత విమానాల్లో ప్రయాణించే సౌకర్యం ఉంది. అలాంటప్పుడు ఫ్లైట్ టైం అయిపోయిందని చెప్పలేరు. వాళ్లు సీఎం స్థానాల్లో ఉన్నప్పుడు కావాల్సిన సమయంలో ప్రయాణించే అవకాశం ఉంటుంది. (india bloc)
ముంబైలో జరిగిన సమావేశం తర్వాత ఇండియా కూటమికి సంబంధించిన లోగో విడుదల చేస్తామని చెప్పారు. కానీ విడుదల చేయలేదు. కూటమికి కన్వీనర్‌ను ఏర్పాటుచేస్తామనీ చెప్పారు. అదీ చేయలేదు. దాంతో ఇండియా కూటమిలో ముసలం ఉందని క్లియర్‌గా అర్థమవుతోంది. దాదాపు రెండు రోజుల సమావేశం తర్వాత సింపుల్‌గా ఒక పేజీ వివరణను విడుదల చేసారు. అందులో అందరం వీలైనంత వరకు కలిసికట్టుగా ఎన్నికల్లో పోటీ చేస్తామని రాసి ఉంది. కానీ సీట్ షేరింగ్, ఇతర రాజకీయ అంశాలను మాత్రం వివరించలేదు. సీట్ షేరింగ్ వివరాలు, మేనిఫెస్టోలకు సంబంధించి ఒక తేదీ అనుకుంటే బాగుంటుంది అని వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇతర పార్టీ నేతలతో అన్నారు. కానీ సీతారాం యేచూరి మాత్రం ఇప్పుడే ఎందుకు ముందు అందరితో డిస్కస్ చేసి ఆ తర్వాత నిర్ణయిద్దాం అన్నారట. దాంతో దీదీకి ఒళ్లు మండింది.
అంతేకాదు.. మీటింగ్ తర్వాత రాహుల్ గాంధీ అదానీ సంస్థలపై వస్తున్న ఆరోపణల గురించి ప్రస్తావించారు. ఈ విషయం గురించి సమావేశంలో ఎవ్వరితో చర్చించకుండా రాహుల్ మీడియా ముందు మాట్లాడటం కూడా మమతకు నచ్చలేదు. లోక్ సభ స్థానాల్లో పోటీ చేసేందుకు గానూ ఒక ప్లాన్ కావాలి. ఇందుకోసం ఇండియా కూటమి 14 మంది సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటుచేసింది. కానీ ఆ 14 మందిలో ఒక్కరు కూడా అనుభవం ఉన్నవారు లేరని తెలుస్తోంది. ఇలా అయితే NDAను ఎదుర్కోవడం కష్టమేనని అంటున్నారు రాజకీయ నిపుణులు. (india bloc)