Janmashtami: అతిపురాతన కన్నయ్య ఆలయాలు.. !
శ్రీ కృష్ణ జన్మాష్టమికి (janmashtami) ఇంకా ఒక్క రోజే ఉంది. ఈ నెల 6, 7 తేదీల్లో జన్మాష్టమిని ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఒకవేళ మీరు ఈ జన్మాష్టమి నాడు అతిపురాతనమైన కన్నయ్య ఆలయాలను దర్శించుకోవాలని అనుకుంటే.. ఈ ఐదు ఆలయాల గురించి తెలుసుకోండి.
బన్కే బిహారీ ఆలయం (banke bihari temple)
ఈ ఆలయం ఉత్తర్‌ప్రదేశ్‌లోని బృందావనంలో (vrindavan) ఉంది. ఇక్కడ రాధాకృష్ణులు దర్శనమిస్తారు. బృందావనానికి చెందిన కృష్ణ భక్తుడు స్వామీ హరిదాస్ ఇక్కడ రాధాకృష్ణ విగ్రహాలను ప్రతిష్ఠించారు. గోకులంలో రాధాకృష్ణులకు అత్యంత ప్రియ సన్నిహితుడైన లలితా గోపినే హరిదాస్గా జన్మించాడని చెప్తుంటారు. ఈ ఆలయంలో రాధాకృష్ణుల విగ్రహాలు త్రిభంగ ఆకారంలో నిలబడి ఉంటారు. (janmashtami)
ద్వారకాదీశ్ ఆలయం (dwarakadeesh temple)
ఈ అతిపురాతన ఆలయం గుజరాత్లో (gujarat) ఉంది. దీనిని జగత్ మందిర్ అని కూడా పిలుస్తారు. కృష్ణుడి ముని మనవడైన వజ్రనాభుడు ఈ ఆలయాన్ని 2500 ఏళ్ల క్రితం కట్టించారట. 16 నుంచి 19 శతాబ్దాల్లో ఈ ఆలయాన్ని ఎంతో బాగా తీర్చిదిద్దారు. బ్రజ్ నుంచి ద్వారకను నిర్మించడానికి కృష్ణుడే స్వయంగా ఈ ప్రాంతానికి వచ్చినట్లు భక్తుల విశ్వాసం. ఇక్కడ కన్నయ్యను ద్వారాకాదీశునిగా పూజిస్తారు. ద్వారకాదీశుడు అంటే ద్వారకకు రాజు అని అర్థం.
పూరీ జగన్నాథ్ (puri jagannath)
జగన్నాథుని రూపంలో కొలువై ఉన్న ఈ కృష్ణుడి ఆలయంలో ఒడిసాలో (odisha) సముద్ర తీరాన ఉంది. అసలైన ఆలయాన్ని అవంతి రారాజు ఇంద్రాద్యుమ్న ఈ ఆలయాన్ని నిర్మించాడు. ఇప్పుడు పూరీలో ఉన్న జగన్నాథుని ఆలయాన్ని గంగా వంశానికి చెందిన రాజు అనంతవర్మన్ చోడగంగ 11వ శతాబ్దంలో నిర్మించినది. కృష్ణుడు (జగన్నాథుడు), బలదేవ్ (బలరాముడు), వీరి చెల్లెలు సుభద్రల విగ్రహాలను ఒకేసారి ప్రతి ఏటా ఊరేగించే ఉత్సవం కన్నులపండుగలా ఉంటుంది. ఒకవేళ మీరు ఈ జన్మాష్టమి రోజున జగన్నాథుని ఆలయాన్ని దర్శించుకోవాలనుకుంటే ఒడిశా వెళ్లలేని పరిస్థితిలో మన హైదరాబాద్‌లోనే జగన్నాథుని రూపకల్పనతో నిర్మించిన ఆలయం ఉంది. బంజారా హిల్స్‌లోని భవానీ నగర్లో ఉన్న ఈ ఆలయాన్ని సందర్శించండి. (janmashtami)
ఉడుపి శ్రీకృష్ణమాతా ఆలయం (udupi sri krishna matha temple)
కర్ణాటకలోని ఉడుపిలో (udupi) వెలసిన శ్రీకృష్ణ మాతా ఆలయం కూడా అతిపురాతనమైనది. ఇక్కడ కన్నయ్యను 9 రంధ్రాలు కలిగి ఉన్న నవగ్రహ కిటికీ నుంచి వీక్షించడం విశేషం. వెండితో నిర్మించిన ఈ నవగ్రహ కిటికీ ఎంతో చూడముచ్చటగా ఉంటుంది.
రాజగోపాలస్వామి ఆలయం (rajagopala swamy temple)
తమిళనాడులోని మన్నార్గుడిలో (mannargudi) ఉంది ఈ రాజగోపాలస్వామి ఆలయం. 23 ఎకరాల్లో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయాన్ని గురువాయూర్, దక్షిణ ద్వారక అని కూడా పిలుస్తారు. పదో శతాబ్దంలో కులోతుంగ చోళా ఈ ఆలయాన్ని నిర్మించారు. ఆ తర్వాత రాజరాజ చోళా 3, రాజేంద్ర చోళా 3, తంజావూర్ వంశస్థులు ఆలయాన్ని అభివృద్ధి చేస్తూ వచ్చారు. (janmashtami)