OG Glimpse: ఆ మరాఠీ డైలాగ్ ఏదైతే ఉందో…!
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ (pawan kalyan) ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఓజీ గ్లింప్స్ (og glimpse) వచ్చేసింది. 90 సెకెన్లలో ఈ హంగ్రీ చీతా (hungry cheetah) విశ్వరూపాన్ని చూపించేసాడు సుజీత్ (sujeeth). ఇక తమన్ (thaman) ఇచ్చిన BGM దద్దరిల్లిపోయింది. ఫ్యాన్స్ పవన్ నుంచి ఎలాంటి కంటెంట్ కోరుకున్నారో అదే చూపించి మార్కులు కొట్టేసాడు సుజీత్.
గ్లింప్స్ ఒక ఎత్తైతే.. చివర్లో పవన్ మరాఠీ హిందీలో కలిపి చెప్పే ఒక డైలాగ్ మరో ఎత్తు. ఖడే ఖడే క్యా దేఖ్ రహే హో..ఆగే కర్ హాథ్ (నిలబడి ఏం చూస్తున్నావ్.. చెయ్యి ముందుకు చాపు) అంటూ పవన్ ఊపులో చెప్పిన ఈ డైలాగ్ గ్లింప్స్ మొత్తానికే హైలైట్ అని చెప్పాలి. మన హీరోల్లో కొందరికే హిందీ భాష సెట్ అవుతుంది. అలా సూట్ అయ్యేవారిలో పవన్ కళ్యాణ్ టాప్‌లో ఉంటారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇది గ్లింప్స్ కాదు గూస్‌బంప్స్ అంటున్నారు ఫ్యాన్స్. అంతేకాదు.. రిలీజ్ అయిన వెంటనే అతి వేగంగా 200K లైక్స్ సాధించిన ఏకైక గ్లింప్స్ ఇదేనట. (og glimpse)