India vs Pakistan: మ్యాచ్ ఆగిపోతే.. వాట్ నెక్ట్స్?
యావత్ భారతదేశం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రోజు వచ్చేసింది. ఏషియా కప్ 2023లో (asia cup 2023) భాగంగా ఈరోజు భారత్ పాకిస్థాన్ జట్లు (india vs pakistan) తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌కు శ్రీలంకలోని పల్లెకెలె స్టేడియం (pallekele stadium) వేదిక కానుంది. అయితే.. ఈరోజు మ్యాచ్ జరగుతుందో లేదో చెప్పడం కష్టమే. ఎందుకంటే 98% వర్షం పడుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే.. మొత్తం మ్యాచ్ రద్దు అయితే అవ్వదు కానీ.. మధ్యాహ్నం 3 గంటలకు స్టార్ట్ అవ్వాల్సిన మ్యాచ్ కాస్త ఆలస్యంగా స్టార్ట్ అవుతుందని భావిస్తున్నారు.
అయితే ఒకవేళ మ్యాచ్ ఆగిపోతే తర్వాత ప్లాన్ ఏంటి? ఒకవేళ మ్యాచ్ ఆగిపోతే.. రెండు జట్లకు చెరో పాయింట్ వస్తుంది. సూపర్ 4లోకి అడుగుపెట్టాలంటే రెండు టీంలు 20 ఓవర్లు పూర్తి చేయాల్సిందే. మ్యాచ్ జరగకపోతే మాత్రం ఆడకుండానే పాకిస్థాన్ సెమీ ఫైనల్స్‌లో అడుగుపెట్టే ఛాన్స్ వస్తుంది. కానీ మన టీమిండియాకు మాత్రం ఇది డూ ఆర్ డై పరిస్థితి అవుతుంది. ఆ తర్వాత నేపాల్‌తో జరిగే మ్యాచ్‌లో ఇండియా ఎలాగైనా గెలిచి తీరాల్సిందే. టోర్నమెంట్ ఓపెనర్ మ్యాచ్‌లో పాక్ ఆల్రెడీ నేపాల్‌పై ఆడి గెలిచేసింది కాబట్టి వారికి ఆల్రెడీ 3 పాయింట్లు వచ్చేసాయి. కానీ టీమిండియాకు ఇది మొదటి మ్యాచ్. మన రోహిత్ సేనకు నేపాల్ టీంను ఓడించడం పెద్ద కష్టమేమీ కాదు..! మిగతా మ్యాచ్‌ల సంగతి ఎలా ఉన్నా.. ఈరోజు వర్షం పడకూడదని ఇండియా పాక్ మధ్య జరిగే మ్యాచ్ బ్లూ మెన్ టీం గెలవాలని కోట్ల మంది కోరుకుంటున్నారు. (india vs pakistan)