DK Shivakumar: ఆ పంచ్ జగన్‌కేనా?
కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ (dk shivakumar) ఈరోజు మాటల మధ్యలో ఓ పంచ్ వేసారు. ఆ పంచ్ ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికేనేమో (ap cm jagan) అన్నట్లుగా ఉంది. అసలు మ్యాటర్ ఏంటంటే.. కర్ణాటకకు చెందిన 33 మంది హై ప్రొఫైల్ మంత్రుల కోసం ప్రభుత్వం 33 లగ్జరీ ఇన్నోవా కార్లు కొనుగోలు చేయనుంది. వీటి మొత్తం ఖరీదు రూ.9.9 కోట్లు. దాంతో BJP విమర్శిస్తూ.. అంత ఖర్చే పెట్టి ప్రజలకు కేటాయించిన ఫండ్స్‌తో కార్ల షాపింగ్ చేస్తున్నారని విమర్శించారు.
దీనిపై శివకుమార్ స్పందిస్తూ.. “”మంత్రులకు భద్రత కల్పించడంలో తప్పేముంది? వాళ్లు కూడా దూర ప్రాంతాలకు ప్రయాణిస్తుంటారు. మాకు మిగతా రాష్ట్రాల్లాగా హెలికాప్టర్లు, చార్టెడ్ విమానాలు లేవు కదా..? నేను ఈ రోజు ఉదయం కూడా కమర్షియల్ విమానంలోనే ప్రయాణించాను “” అన్నారు. రెండో కిలోమీటర్ల దూరానికి కూడా హెలికాప్టర్ వాడేది జగన్ మోహన్ రెడ్డి మాత్రమే. ఆయన ఎక్కువగా కార్లలో కాకుండా హెలికాప్టర్లలో ప్రయాణిస్తుంటారన్న టాక్ కూడా ఉంది. పైగా ఈ మధ్యకాలంలో ఏ పార్టీకి చెందిన నేతలు కూడా హెలికాప్టర్లలో ప్రయాణించింది లేదు. దాంతో శివకుమార్ జగన్‌ను ఉద్దేశించే ఆ డైలాగ్ వేసారని కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. (dk shivakumar)