Pawan Kalyan Film Festival: అల్లారంలు పెట్టుకోండమ్మా..!
సెప్టెంబర్ 2.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జన్మదినం (pawan kalyan film festival). ఈరోజు పవన్ ఫ్యాన్స్‌కి అసలైన పండుగ రోజు అని చెప్పాలి. సినిమాలు లేనప్పుడు ఆయన (pawan kalyan) బర్త్‌డే వస్తేనే ఫ్యాన్స్ ఎంతో గ్రాండ్‌గా సెలబ్రేట్ చేస్తారు. అలాంటిది ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు సినిమా అప్డేట్లు రాబోతుంటే ఇక వారిని ఆపడం ఎవరి తరం కాదు. రేపు పవన్ నటిస్తున్న మూడు సినిమాల అప్డేట్లు రాబోతున్నారు. అవేంటంటే…
ఓజీ (og)
సుజీత్ డైరెక్ట్ చేస్తున్న ఓజీ సినిమా టీజర్ రిలీజ్ అవబోతోంది. ఫస్ట్‌లుక్ లేదు డైరెక్ట్ టీజర్ అంటూ పోస్టర్ వదిలినప్పుడే ఆ హైప్‌కి ఫ్యాన్స్‌కి జ్వరం వచ్చినంత పనైంది. ఆకలితో ఉన్న చిరుత రాబోతోంది అంటూ ప్రమోషన్స్ చేసారు. శనివారం ఉదయం 10:35 గంటలకు అప్డేట్ రాబోతోంది. (pawan kalyan film festival)
హరిహర వీరమల్లు (hari hara veera mallu)
ఆగిపోయిందేమో అనుకున్న హరిహర వీరమల్లు నుంచి అప్డేట్ అనగానే ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. క్రిష్ జాగర్లమూడి సైలెంట్‌గా ఉంటూనే ఏదో గట్టిగా ప్లాన్ చేసాడు అనిపిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఈరోజు అర్థరాత్రి 12:17 గంటల సమయంలో రిలీజ్ చేయనున్నారు.
ఉస్తాద్ భగత్ సింగ్ (ustaad bhagat singh)
ఇక హరీష్ శంకర్ పవన్‌కి డై హార్డ్ ఫ్యాన్ అన్న విషయం అందరికీ తెలిసిందే. ఉస్తాద్ భగత్ సింగ్ టీజర్ కట్‌తోనే ఫ్యాన్స్‌కి పూనకాలు తెప్పించేసారు హరీష్. ఇక శనివారం ఏ రేంజ్లో అప్డేట్ ఇస్తారో ఫ్యాన్స్ ఊహకే వదిలేసారు. ఉస్తాద్ భగత్ సింగ్ అప్డేట్ శనివారం సాయంత్రం 6:03 గంటలకు రిలీజ్ అవనుంది. (pawan kalyan film festival)