Mamata Banerjee: రాహుల్పై అలిగిన దీదీ
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీపై (rahul gandhi) వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ (mamata banerjee) అలిగారు. రెండు రోజుల పాటు ముంబైలో ఇండియా (india) కూటమిలో భాగంగా సమావేశాలు జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈరోజు రాహుల్ తనను కానీ కూటమిలోని మరే పార్టీతో కానీ అదానీ కంపెనీపై (adani) వస్తున్నా ఆరోపణల గురించి చర్చించకుండా మీడియా ముందు మాట్లాడేసాడట. జీ20 సమ్మిట్ జరగడానికి ముందు ప్రధాని నరేంద్ర మోదీ (narendra modi) అదానీ కంపెనీలపై వస్తున్న ఆరోపణలను లోతుగా విచారించేలా ఆదేశాలు జారీ చేయాలని రాహుల్ అన్నారు. అయితే ఈ విషయం గురించి ఒక్క మాట కూడా చర్చించకుండా రాహుల్ మీడియా ముందు మాట్లాడటం దీదీకి నచ్చలేదు. (mamata banerjee)