Rahul Gandhi: ఎన్నిక‌ల్లో BJP గెల‌వ‌డం అసాధ్యం

రానున్న లోక్ స‌భ ఎన్నిక‌ల్లో (lok sabha elections) BJP గెల‌వ‌డం అసాధ్య‌మ‌ని అంటున్నారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (rahul gandhi). ప్ర‌తిప‌క్షాలు ఏక‌మైతే BJP ఓట‌మి ఖాయ‌మ‌ని తెలిపారు. త‌న ఇండియా కూట‌మిలో ఉన్న 26 పార్టీల స‌మూహం దేశంలోని 60% జ‌నాభాతో స‌మాన‌మ‌ని.. వీరంతా ఒక్క‌టైతే BJPని ఎదుర్కోవ‌డం చాలా ఈజీ అని ధీమా వ్య‌క్తం చేస్తున్నారు.

“” మాపై న‌మ్మ‌కం ఉంచి మాతో చేసిన అపోజిష‌న్ పార్టీల‌కు ధ‌న్య‌వాదాలు. మాలో మాకు గొడ‌వ‌లు ఉన్న‌మాట నిజ‌మే కానీ మేమంతా ప‌నిచేసేది ఇండియా బాగు కోస‌మే. కేంద్ర ప్ర‌భుత్వం అవినీతిని మా కూట‌మి బ‌ట్ట‌బ‌య‌లు చేసి తీరుతుంది. జీ20 స‌మిట్ జ‌ర‌గ‌డానికి ముందే అదానీ విష‌యంలో లోతుగా విచార‌ణ జ‌రిపించాల‌ని నేను ఎప్ప‌టినుంచో చెప్తున్నాను. కానీ మోదీకి అదానీకి ఏం డీలింగ్స్ ఉన్నాయో వారికే తెలియాలి అంటూ చుర‌క‌లు అంటించారు “” రాహుల్. (rahul gandhi)