India: వీలైనంత వరకు కలిసే పోటీ చేస్తాం
ముంబైలో (mumbai) అపోజిషన్ కూటమి ఇండియా (india) మూడోసారి సమావేశం అయింది. ఈ సందర్భంగా రానున్న లోక్ సభ ఎన్నికల్లో (lok sabha elections) ఇండియాలో (india bloc) ఉన్న 26 పార్టీలు వీలైంతవరకు కలిసే పోటీ చేస్తామని నిర్ణయానికి వచ్చాయి. ఈ నేపథ్యంలో 13 మంది నేతలు ఉన్న కోఆర్డినేషన్ కమిటీని ఏర్పాటుచేసింది. ఈ 13 మంది వివిధ పార్టీలకు చెందినవారు. ప్రచారానికి కావాల్సిన ప్లాన్స్ కూడా ఇదే సమావేశంలో డిసైడ్ చేయనున్నారు.
భారత్ కలుస్తుంది.. గెలుస్తుంది అన్న నినాదంతో ఎన్నికల్లో పోటీకి దిగనున్నారు. తమ కూటమి లోగోను త్వరలో ఆవిష్కరించనున్నారు. ఇక కన్వీనర్‌ను మార్చాలా వద్దా అనేది త్వరలో నిర్ణయిస్తామని తెలిపారు. (india)ఆగస్ట్ 2 కల్లా మేనిఫెస్టో ప్రకటించాలని వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ (mamata banerjee) తెలిపారు. అన్ని పార్టీలు కలిసి BJPకి దిమ్మతిరిగేలా ఒక కామన్ ఎజెండాను తీసుకురావాలని ప్రస్తుతం కన్వీనర్‌గా వ్యవహరిస్తున్న మల్లికార్జున ఖర్గే (mallikarjun kharge) తెలిపారు.