PM భర్త కామెంట్స్.. ఎక్కువ తాగి రేప్‌కి గురికావద్దు
ఇటాలీ ప్రధాని (pm) జార్జియా మెలోనీ (georgia meloni) భర్త ఆండ్రీ గ్యాంబ్రోనో చేసిన వ్యాఖ్యలు ఇటలీ వ్యాప్తంగా రచ్చకు దారి తీసాయి. ఇటలీలోని నేపుల్స్, పాలెర్మో ప్రాంతాల్లో ఇటీవల హై ప్రొఫైల్ గ్యాంగ్ రేప్స్ జరిగాయి. వీటి గురించి స్థానిక మీడియా ఛానెల్‌లోని షో నిర్వహించిన కార్యక్రమంలో ఆండ్రీ మాట్లాడారు. పార్టీలకు వెళ్లి డ్యాన్సులు చేయాలనుకుంటే కచ్చితంగా తాగుతారని.. అలాంటప్పుడు తాగకుండా ఉంటే మన జాగ్రత్తలో మనం ఉంటామని.. రేప్‌లకు గురికాకుండా ఉంటారని తెలిపారు. ఆండ్రీ వ్యాఖ్యలను ఆ దేశానికి చెందిన ఓ వార్తా సంస్థ కూడా సమర్ధించింది. కానీ ఇటలీ ప్రధాని జార్జియాకు మాత్రం పెద్ద చిక్కు వచ్చి పడింది.