Fire Accident: దందాలు జరిగే బిల్డింగ్.. 73 మంది సజీవదహనం
జొహానెస్‌బర్గ్‌లో (johannesburg) ఈరోజు తెల్లవారుజామున 5 అంతస్తుల భవనంపై భారీ అగ్నిప్రమాదం (fire accident) చోటుచేసుకుంది. ఈ ఘటనలో దాదాపు 73 మంది సజీవదహనం అయ్యారు. 40 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఇంకా సహాయక చర్యలు జరుగుతున్నాయి. అసలు ఈ ఘటన ఎలా జరిగిందో తెలియాల్సి ఉందని స్థానిక అధికారులు చెప్తున్నారు. ఈ భవనంలో అక్రమ దందాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయట. జొహానెస్‌బర్గ్‌ని సౌత్ ఆఫ్రికా బిజినెస్ డిస్ట్రిక్ట్‌గా పిలుస్తారని తెలిపారు. ఇప్పుడు ప్రమాదం జరిగిన బిల్డింగ్‌ను ఇల్లీగల్ సెటిల్‌మెంట్లను ఉపయోగిస్తుండేవారని ఇలాంటి దందాలు జొహానెస్‌బర్గ్‌లో ఎక్కువగా జరుగుతుంటాయని వెల్లడించారు.
మొన్న జూన్‌లో జొహానెస్‌బర్గ్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఇలాగే మంటలు చలరేగి ఇద్దరు చిన్నారులు చనిపోయారు. వారిని ఆ అపార్ట్‌మెంట్‌లో ఎవరో లాక్ చేసి వెళ్లిపోయారట. ఇల్లీగల్ దందాలు ఎక్కువ కాబట్టి.. హత్యలు కూడా ఎక్కువే. కాకపోతే డైరెక్ట్‌గా కాకుండా ఇలా ఎవ్వరికీ అనుమానం రాకుండా అగ్నిప్రమాదం సంభవించినట్లు కూడా ప్లాన్లు వేస్తుంటారు అక్కడి క్రిమినల్స్. ఈ ఘటన కూడా అలాగే జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. (fire accident)