Nagarjuna: ఆ సినిమాను డిలీట్ చేయించేసారా?
వరుస ఫ్లాప్స్ తర్వాత ఇప్పుడు ఒక మాస్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు అక్కినేని నాగార్జున (nagarjuna). నిన్న ఆయన బర్త్‌డే సందర్భంగా నా సామిరంగ (naa samiranga) సినిమా టీజర్‌ను రిలీజ్ చేసారు. మాస్ లుక్‌లో నాగ్ అదిరగొట్టేసారు. చూడబోతే ఈ సినిమాతో హిట్ కొట్టేలానే ఉన్నారు. అయితే ఈ సినిమా మలయాళంలో వచ్చిన పోరింజు మరియం జోస్ (porinju mariam jose) అనే సినిమాకు రీమేక్ అని తెలుస్తోంది. ఈ సినిమా మొన్నటి వరకు అమెజాన్ ప్రైంలో (amazon prime) ఉండేది. అయితే ఈ విషయం ఎక్కడ ఆడియన్స్‌కి తెలిస్తే సినిమా చూసేస్తారో అన్న భయంతో తెలివిగా అమెజాన్ ప్రైం నుంచి ఆ మలయాళం సినిమాను నాగ్ డిలీట్ చేయించేసారని టాక్. సుబ్రహ్మణ్యం పచ్చ ఈ సినిమాను డైరెక్ట్ చేసారు. సంక్రాంతికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. (nagarjuna)
పోరింజు మరియం జోస్ కథేంటి?
1965 నుంచి 1985 మధ్యలో జరిగే కథ ఇది. జోయ్, జోస్ అనే ఇద్దరు ప్రాణ స్నేహితుల నేపథ్యంలో సాగుతుంది. బలదూర్‌గా తిరిగే జోయ్..తనతో పాటు స్కూల్లో చదివే మరియం అనే అమ్మాయిని ఇష్టపడతాడు. తన ప్రేమ విషయం చెప్పాలనుకుంటాడు కానీ చెప్పలేడు. ఓసారి మరియంని వేరే క్లాస్ అబ్బాయి ఏడిపిస్తుంటే జోయ్ అతన్ని చావకొడతాడు. విషయం టీచర్‌కి తెలీడంతో అతన్ని అందరిముందు తిట్టి టీసీ ఇచ్చి పంపించేస్తుంది. తన ఫ్రెండ్‌ని తిట్టిందన్న కోపంతో జోస్ కూడా టీచర్ని తిట్టి జోయ్‌తో పాటు వెళ్లిపోతాడు. ఇది 1965లో జరిగిన కథ.
కట్ చేస్తే.. అది 1985. జోయ్ వేటగాడిగా మారి.. ముత్తలాలి అనే పెద్ద వ్యాపారవేత్త దగ్గర పనికోసం చేరతాడు. ముత్తలాలికి జోయ్ ఎంత చెప్తే అంత. అది ముత్తలాలి కొడుకులకు నచ్చదు. ఇక జోస్ డిస్కో డ్యాన్సర్‌గా డ్యాన్సులు వేస్తూ డబ్బులు సంపాదించుకుంటూ ఉంటాడు. జోయ్ ప్రేమించిన మరియం వడ్డీ వ్యాపారం చేస్తుండేది. వీరు ముగ్గురు స్కూల్ తర్వాత కూడా మంచి ఫ్రెండ్స్‌గా ఉంటారు. ఓసారి చర్చిలో ఏటా జరిగే ఊరేగింపు కార్యక్రమంలో జోయ్, జోస్, మరియంలు పాల్గొంటారు. ఆ వేడుకలో ముత్తలాలి మనవడు ప్రిన్స్ కూడా ఉంటాడు. ప్రిన్స్ మరియంను చూసి ఎక్కడ పడితే అక్కడ చేతులు వేస్తాడు. అది గమనించి జోయ్ ప్రిన్స్‌ని చావగొడతాడు. (nagarjuna)
మనవడ్ని కొడుతున్నా కానీ ముత్తలాలి ఏమీ పట్టనట్టు ఉంటాడు. ఈ నేపథ్యంలో మరియంను జోయ్ లేపుకుపోవాలని ప్లాన్ వేస్తున్నాడని మరియం తండ్రి వర్గీస్‌కి తెలుస్తుంది. దాంతో వర్గీస్.. అలా చేస్తే ఉరేసుకుని చనిపోతానని బెదిరించడానికి గొంతుకు ఉరితాడు వేసుకుంటాడు. కానీ పొరపాటున తాడు బిగుసుకుపోయి వర్గీస్ చనిపోతాడు. మరుసటి ఏడాదిలో మళ్లీ జరిగే ఊరేగింపులో జోయ్‌ని ఎలాగైనా చంపాలని ప్రిన్స్ ప్లాన్ వేస్తాడు. ఆ సమయంలో జోయ్ ప్రాణ స్నేహితుడైన జోస్‌ని ఆల్రెడీ చంపేస్తారు. దాంతో కోపంలో ప్రిన్స్‌ని చంపేస్తాడు జోయ్. మనవడిని చంపినందుకు ముత్తలాలి జోయ్‌ని చంపాలని ప్లాన్ వేస్తాడు. ఊరేగింపు జరుగుతున్న సమయంలో ముత్తలాలి జోయ్‌ని చంపేస్తాడు. ఇక మరియం జోయ్ జ్ఞాపకాలతో బతికేస్తుంటుంది. ఇది కథ.