Rakhi కానుకగా.. అన్నకు కిడ్నీ దానం
రక్షా బంధన్ (rakhi) రోజున ఓ చెల్లెలు అన్నకు జీవితాన్నే కానుకగా ఇచ్చింది. రెండు కిడ్నీలు ఫెయిల్ అయిపోవడంతో ఎంతో బాధపడుతున్న అన్నకు తన కిడ్నీ దానం చేసి కొత్త జీవితాన్ని ఇచ్చింది. ఈ ఘటన ఛత్తీసగడ్లో చోటుచేసుకుంది. రాయ్‌పూర్‌కి (raipur) చెందిన ఓం ప్రకాష్ అనే 48 ఏళ్ల వ్యక్తి కొంతకాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడు. డయాలసిస్‌పై ఉన్న తన అన్నకు ఎలాగైనా కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించాలనుకుంది ఓం ప్రకాష్ చెల్లెలు షీలాబాయ్. ఎన్ని ప్రయత్నాలు చేసినా సూట్ అయ్యే కిడ్నీ దొరకలేదు. దాంతో తనే కిడ్నీ దానం చేయాలని నిర్ణయించుకుంది షీలాబాయ్. దానికి కావాల్సిన టెస్ట్‌లన్నీ చేయించింది. అన్నీ ఓకే అవడంతో సెప్టెంబర్ 3న సర్జరీ చేయనున్నారు. తన అన్న మిగతా జీవితాన్ని సంతోషంగా గడపాలని కోరుకుంటున్నానని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని షీలాబాయ్ తెలిపింది. ఇది కదా అసలైన అన్నాచెల్లెళ్ల అనుబంధం అంటే..! (Rakhi)