Rajinikanth: కండక్టర్‌గా పనిచేసిన బస్ డిపోలో తలైవా..!
ఎంత ఎదిగినా మనం ఎక్కడి నుంచి వచ్చామో దానిని మర్చిపోకూడదని అంటారు. సూపర్‌స్టార్ రజినీకాంత్ (rajinikanth) ఇందుకు నిలువెత్తు నిదర్శనం. ఆయన సినిమాల్లోకి రాకముందు బస్ కండక్టర్‌గా పనిచేసేవారన్న విషయం మనకు తెలిసిందే. జైలర్ (jailer) రూ.600 కోట్లు రాబట్టిన సందర్భంగా తాను కండక్టర్‌గా కెరీర్ మొదలుపెట్టిన బస్ డిపోకి వెళ్లాలనుకున్నారు తలైవా. ఎవ్వరికీ చెప్పకుండా బెంగళూరులోని (banglore) జయనగర్ (jaya nagar) బస్ డిపోకి వెళ్లి అక్కడివాళ్లను సర్ప్రైజ్ చేసారు. అక్కడ పనిచేస్తున్న వారితో ఫోటోలు దిగి వారితో కాసేపు టైం స్పెండ్ చేసారు. (rajinikanth)